సంక్రాంతి బరిలో 8 మంది వారసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా రంగంలో వారసులకు కొదవలేదు. ప్రముఖ నటీనటుల కుమారులే కాదు నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల పిల్లలు సైతం హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. అయితే ఈసారి చివరి నిమిషంలో ‘ట్రిపుల్ ఆర్’ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో ఈ సీజన్ పై టాలీవుడ్ వారసులు కన్నేశారు. మూవీ మొఘల్ రామానాయుడు మనవడు, సురేశ్ బాబు తనయుడు రానా నటిస్తున్న ‘1945’ చిత్రం ఈ నెల 7న విడుదల కాబోతోంది. సరిగ్గా అదే రోజున సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన ‘అతిథి దేవోభవ’ మూవీ రిలీజ్ అవుతోంది. ఇదే రోజున మరో నట వారసుడు సైతం జనం ముందుకు వస్తున్నాడు. అతనే శివాజీ రాజా కొడుకు విజయ్ రాజా. ఈ తండ్రీకొడుకులు నటిస్తున్న ‘వేయి శుభములు కలుగు నీకు’ సినిమా జనవరి 7న విడుదల కాబోతోంది. తమన్నా వ్యాస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్స్ రాథోడ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
Read Also : బ్రేకప్ టియర్స్ : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి సునయన
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతని మలి చిత్రం ‘సూపర్ మచ్చి’ జనవరి 14న విడుదల కాబోతోంది. అలానే సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న ‘హీరో’ చిత్రం సంక్రాంతి కానుకగా 15వ తేదీ జనం ముందుకు వస్తోంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ సైతం ‘రౌడీ బాయ్స్’తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలోనే దిగబోతోంది. మరో నిర్మాత ఎమ్మెస్ రాజు కొడుకు, యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ నటించిన ‘7 డేస్ 6 నైట్స్’ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున తనయుడు నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతి వస్తోంది. నాగ్, చైతు కలిసి నటించిన ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!