చిన్న చిత్రాలకు వరంగా మారిన ‘ట్రిపుల్ ఆర్’ వాయిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తప్పుకోవడం కాదు గానీ… చిన్న చిత్రాల నిర్మాతలకు అది జాక్ పాట్ గా మారింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తమ చిత్రాలను విడుదల చేసుకోవడం కష్టం అని భావించిన చాలామంది చిన్న చిత్రాల నిర్మాతలు ఇప్పుడు సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సిద్ధు జొన్నలగడ్డతో తీసిన ‘డిజె టిల్లు’ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తామని ప్రకటించగా, ఆ మర్నాడే అంటే జనవరి 15న ‘హీరో’ మూవీ రిలీజ్ చేయబోతునట్టు నిర్మాతలు తెలిపారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన కుమారుడు గల్ల అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ గల్లా జయదేవ్, పద్మావతి ఈ సినిమాను నిర్మించారు.
Read Also : కత్రినాకు షాక్… విక్కీ కౌశల్ పై కేసు నమోదు
Also Read
అలానే డిసెంబర్ 31న విడుదల కావాల్సిన రానా ‘1945’ చిత్రాన్ని జనవరి చివరిలో లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తామని తెలిపిన ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఇప్పుడు మనసు మార్చుకుని దాన్ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. అయితే… విడుదల తేదీని ఇతిమిద్థంగా చెప్పకపోయినా… సంక్రాంతి బరిలోనే నాగార్జున, నాగచైతన్య ‘బంగార్రాజు’ రాబోతోంది. మరి కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు కూడా తమ చిత్రాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే… పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ సైతం వాయిదా పడినట్టేనని, లేదంటే ఇంతమంది తమ సినిమాల విడుదల తేదీని ఇలా ప్రకటించరని ఫిల్మ్ నగర్ టాక్!
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!