ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోయింది. 26 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపు సంతరించుకుంది. కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి రంగం పూర్తయింది. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. 9.05 – 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశారు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అయింది. చివరిసారిగా 1979 లో ఏర్పడింది విజయనగరం జిల్లా. పరిపాలన వికేంద్రీకరణ…