శుక్రవారం జరిగిన ఆసియా కప్ 2025లో ఒమన్‌పై టీం ఇండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తన 100వ T20I వికెట్‌ను చేరుకున్న అర్ష్‌దీప్ సింగ్‌కు ఈ మ్యాచ్ చిరస్మరణీయమైనదిగా నిలిచింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ మొదటి బంతికే అతను తన 100వ వికెట్ తీసుకున్నాడు. ఈ ఘనత కోసం ఎనిమిది నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. చివరికి 100 T20I వికెట్లు తీసిన మొదటి భారతీయ ఆటగాడిగా నిలిచాడు.…
Yuzvendra Chahal: టీమ్ ఇండియా అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఇంగ్లిష్ గడ్డపై కౌంటీ క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తున్నాడు. అక్కడ నార్తాంప్టన్ షైర్ జట్టులో భాగంగా యుజ్వేంద్ర చాహల్ ఉన్న సంగతి తెలిసిందే. డెర్బీషైర్ తో జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుతమైన ప్రద్రర్శన చేసాడు. జట్టు కోసం, అతను మొదటి ఇన్నింగ్స్‌లో 16.3 ఓవర్లు బౌలింగ్ చేసి 45 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతని మ్యాజిక్ కనిపించింది. అతను…
లీడ్స్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌లో 100 సిక్సర్లు కొట్టి బౌలింగ్‌లో100 వికెట్లు తీసిన ఆటగాడిగా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో స్టోక్స్ 18 పరుగులు చేశాడు. ఈ సిక్సర్‌తో టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. ఇప్పటి వరకు అతడు 81 టెస్టులు ఆడి మొత్తం…