‘మొగలి రేకులు’ సీరియల్‌తో బుల్లితెరపై తిరుగులేని గుర్తింపును సాగర్ (ఆర్.కె నాయుడు) సంపాదించుకున్నాడు. అతను నటించిన తాజా చిత్రం ‘షాదీ ముబారక్’ ఈ యేడాది మార్చిలో విడుదలైంది. ప్రస్తుతం సాగర్ (ఆర్.కె. నాయుడు) ‘100’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సామాజిక ఇతివృత్తంతో ఈ సినిమా ఉంటుందని, ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలని చెప్పే చిత్రమిదని సాగర్ అన్నాడు. ‘మొగలి రేకులు’ సీరియల్‌లోని ఆర్. కె. నాయుడును మరపించే పోలీస్ పాత్ర కోసం చాలా…