దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం సత్‌ఫలితాన్ని ఇచ్చింది. వాణిజ్య యుద్ధం చల్లారింది. రెండు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాపై విధించిన సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చైనాపై 57 శాతం సుంకం అమలవుతోంది. ట్రంప్ ప్రకటనతో 47 శాతానికి దిగొచ్చింది.
గంగవరం పోర్టులో క్రమంగా తన వాటాలను పెంచుకునే పనిలో పడిపోయింది అదానీ గ్రూప్.. తాజాగా, గంగవరం పోర్టులోని ప్రభుత్వ పెట్టుబడులను తమకు విక్రయించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.. అయితే, అదానీ గ్రూప్ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.. సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో ఎంపవర్డ్ కమిటీ వేసింది సర్కార్.. కమిటీలో సభ్యులుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ,…