Health Care: ప్రస్తుతం మారిన జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చూస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటం కోసం వ్యాయామాలు చేయడం, ఉదయం వాకింగ్ చేయడం.. యోగాలు చేయడం చేస్తున్నారు. వ్యాయామాలు, యోగాలు, వాకింగ్ చేయలేని వారు ఆరోగ్యంగా ఉండటం కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండటం కోసం తీసుకోవల్సిన ఆహారాలను తీసుకొంటూ మరికొందరు తమ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు. ఇలా ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతి ఒక్కరూ ఏదో రకంగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యంగా లేకపోతే వైద్య ఖర్చుల కోసం విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుందనే భయంతో ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం అనేక పాట్లు పడుతున్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు తమ కుటుంబ ఖర్చులో 10 శాతం తగ్గకుండా ఖర్చు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా 25 శాతం వరకు ఖర్చు చేస్తున్నట్టు కొన్ని సర్వేల్లో తేలింది. మరికొందరైతే ఇంతకంటే ఎక్కువ కూడా ఖర్చు చేస్తున్నట్టు సర్వేలో బహిర్గతం అయింది.
Read also: Jonny Bairstow Run-Out: మరోసారి ఆస్ట్రేలియా చీటింగ్.. అనూహ్య రీతిలో బెయిర్‌స్టో అవుట్! (వీడియో)
దేశంలోని ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం చేస్తున్న ఖర్చు పరిమితులు దాటుతున్నది. దేశంలోని దాదాపు 9 కోట్ల మంది భారతీయులు ఈ విషయంలో విపత్తు(అత్యధికం) స్థాయిలను దాటి ఖర్చు చేస్తున్నారు. వారి కుటుంబ ఖర్చులో 10 శాతానికిపైగా ఆరోగ్య సంరక్షణకే ఖర్చు చేస్తున్నారు. సైస్టెనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డీజీ) నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్‌వర్క్ ప్రోగ్రెస్ రిపోర్టు 2023 ప్రకారం.. 31 మిలియన్ల మంది తమ కుటుంబ వ్యయంలో నాలుగింట ఒక వంతు ఆరోగ్య సంరక్షణపైనే ఖర్చు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం అంటే ఆరోగ్య సంరక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సర్వే ప్రకారం 2017-18, 2022-23 మధ్య ఆరోగ్యంపై చేస్తున్న ఖర్చు 10 నుంచి 25 శాతానికి పెరిగిందని రిపోర్టులో బయటపడింది. హెల్త్‌కేర్‌పై ఖర్చు చేస్తున్న కుటుంబాల సంఖ్య పెరుగుతుంది.. వారు చేసే ఖర్చు కూడా పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ కోసం చేస్తున్న ఖర్చు మొత్తం కుటుంబ ఖర్చులో 10 శాతానికిపైగా ఖర్చు చేస్తున్న కుటుంబాల సంఖ్య 4.5 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది. కుటుంబ ఖర్చులో 25 శాతానికిపైగా ఖర్చు చేస్తున్న కుటుంబాల సంఖ్య 1.6 శాతం నుంచి 2.3 శాతానికి పెరిగింది. ఇక 2022-23లో కేరళలో 16 శాతం కుటుంబాలు 10 శాతానికిపైగా ఖర్చు చేస్తే, వారిలో 6 శాతం కుటుంబాలు 25 శాతానికిపైగా ఖర్చు చేసినట్టు రిపోర్టులో బహిర్గతం అయింది. ఈ లెక్కలు చూస్తుంటే భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం చేసే ఖర్చు కుటుంబ ఖర్చులో సగానికి చేరే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.