సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు గురువారం తెలిపారు. మరోవైపు.. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి.. ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే.. భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగన్ జిల్లాలోని పక్షేప్ ప్రాంతంలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. రంగ్‌రాంగ్ సమీపంలో ముగ్గురు, పక్షేప్ నుండి ఇద్దరు మిస్సింగ్ అయినట్లు అధికారులు…