Story board: 2023 డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. తొలి ఏడాదిలోనే కొన్ని పనులు చేయాలనుకున్నా.. పాలనాపరమైన పరిమితులతో సాధ్యం కాలేదు. అధికార యంత్రాంగాన్ని లైన్లో పెట్టడానికి కూడా సమయం పట్టింది. సర్కారు చెప్పిన మాట క్షేత్రస్థాయిలో ఆచరణలో కనిపించటానికి కూడా కాస్త టైమ్ తీసుకుంది.
Read Also: CM Revanth Reddy: నాడు ఇద్దరు దోస్తులు గ్యారేజీలో ప్రారంభించారు.. నేడు ప్రపంచంలోనే ప్రఖ్యత కంపెనీ..
తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రం ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను ఆకట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచి హామీల అమలు దిశగా ముందడుగు వేసింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాలన మొదలుపెట్టి.. ఆరోగ్యశ్రీ పరిమితి కూడా పెంచి హామీల విషయంలో వెనకడుగు లేదని చాటుకుంది. కానీ అనుకున్నంతగా తొలి ఏడాదిలో కాంగ్రెస్ పాలన సాగలేదు. బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదేళ్ల పాటు వివిధ శాఖల్లో తిష్ట వేసిన అధికారులను, వారి మైండ్‌సెట్‌ను మార్చటానికి సమయం పట్టింది. అలా తొలి ఏడాదిలో సర్కారు ఆలోచనకు, యంత్రాంగం ఆచరణకు మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో ప్రభుత్వాని కొంత తడబాటు తప్పలేదు. ముఖ్యంగా ఎన్నికల్లో సరైన ఫలితాలు సాధించని జీహెచ్ఎంసీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు. తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల విషయంలో కొన్ని సమస్యలు రావడంతో.. సర్కారుపై విమర్శలు తప్పలేదు.
Read Also: Hebah Patel : హెబ్బా పటేల్ నుండి బ్యాక్ టు బ్యాక్ మూవీస్
అయితే, సమస్యలు వచ్చిన వెంటనే సమీక్షించిన సర్కారు.. గత ప్రభుత్వం కంటే ఎక్కువ విద్యుత్ అందుబాటులో ఉంచినా.. కావాల్సినంత తాగునీరు ఉన్నా.. ఎందుకు ప్రజల్లో అసంతృప్తి వచ్చిందో కూపీ లాగింది. అప్పుడే అధికారుల నిర్వాకం బట్టబయలైంది. దీంతో అప్పటిదాకా అధికారులతో ఉదారంగా వ్యవహరించి మంచి మాటలతో పనిచేయించుకోవాలనుకున్న వ్యూహం పనిచేయదని తేలిపోయింది. అప్పుడు అధికారుల పనితీరుని సమీక్షించి.. గత పాలనలో సుదీర్ఘకాలం ఒకేచోట పనిచేసిన వారి జాబితా తెప్పించుకుని.. నాలుగైదుసార్లుగా పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు బదిలీలు చేస్తే కానీ.. యంత్రాంగంపై కాంగ్రెస్ సర్కారుకు పట్టు చిక్కలేదు. అదే విధంగా శాఖల వారీగా ప్రక్షాళనపై దృష్టి పెట్టిన తర్వాతే.. పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రభుత్వ వైఖరి ఏంటో ఒకటికి రెండుసార్లు సీఎం, మంత్రులు వివరించిన తర్వాతే యంత్రాంగంలోనూ అపోహలు తొలిగాయి. ప్రతిపక్షాలు కొన్ని అడ్డంకులు సృష్టించటానికి ప్రయత్నించినా, ఉద్దేశపూర్వకంగా పరిపాలనను ఫెయల్ చేయాలని చూసినా.. అవేవీ వర్కవుట్ కాలేదు. ఏం జరిగినా సమష్టి బాధ్యత తీసుకున్న కాంగ్రెస్ సర్కారు.. పాలనలో కొత్త ఒరవడిని పరిచయం చేసింది. మంచైనా, చెడైనా కలిసే ఎదుర్కోవాలనే తీరును పాటించి చూపించింది. ఈ వ్యవహారం గత కాంగ్రెస్ ప్రభుత్వాలకు భిన్నంగా ఉండటంతో.. ప్రజల్లో కూడా ప్రస్తుత సర్కారుపై క్రమంగా నమ్మకం పెరుగుతూ వచ్చింది. దీంతో ప్రతిపక్షాలు కూడా కంగుతినక తప్పలేదు.
Read Also: Priyanka Chopra: ఏడాదిలో 6 సినిమాలు ఫ్లాప్.. ఎంతో కష్టపడ్డ.. ప్రియాంక ఎమోషనల్ స్పీచ్..
అలాగే మంచి ఉద్దేశంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా అధికారుల అలసత్వంతో సర్కారుకు చెడ్డపేరు తీసుకొచ్చాయి. వాటిని సరిదిద్దటానికి, అసలు ఉద్దేశమేంటో ప్రజలకు వివరించటానిక ప్రభుత్వానికి సమయం పట్టింది. హైడ్రా లాంటి అంశాల్లో ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించి సర్కారును ఇరుకునపెట్టాయి. ఆ తర్వాత తేరుకున్న ప్రభుత్వం.. హైడ్రాకు ప్రజల నుంచి మద్దతు కూడగట్టగలిగింది. అలాగే హెచ్‌సీయూ భూముల విషయం కూడా వివాదాస్పదమైనా.. సుప్రీంకోర్టు జోక్యంతో.. అది సెటిలైంది. తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ వంటి బలమైన ప్రతిపక్షాలు ఉండటం, తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు అధికారం రావడం , అందులో .. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రిగా నిలదొక్కుకోవడంలో రేవంత్‌కు రకరకాల తలనొప్పులను ఎదుర్కొన్నారు. అయితే దూకుడుగా వ్యవహరించే రేవంత్, ఈ ఒత్తిళ్లను తట్టుకొని నిలబడగలిగారు.
Read Also: JD vance-Usha: రెస్టారెంట్‌లో జేడీవాన్స్-ఉషా వాన్స్ ఘర్షణ.. ఫొటో వైరల్!
కాంగ్రెస్ సర్కారు వచ్చిన తొలినాళ్లలో.. ఈ ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచ్చిందే కానీ.. పాలన సరిగా చేయలేకపోతోందనే భావన అక్కడక్కడా వ్యక్తమైంది. కానీ అలాంటి అభిప్రాయాన్ని కూడా తన పనితీరుతో ప్రభుత్వం మార్చగలిగింది. ఎక్కడైనా ఒక్కసారిగా మార్పు తీసుకురావడం కుదరదు. అందుకు కాస్త సమయం పడుతుంది. అలాగే మార్పు వచ్చే సమయంలో విమర్శలు కూడా తప్పవు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కూడా తొలి ఏడాదిలో సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంది. అయితే విమర్శలకు బెదిరిపోకుండా.. తాము అనుకున్న అజెండా ప్రకారం పాలన అందిస్తామని ప్రజలకు నమ్మకంగా చెప్పగలిగింది. ఎన్ని రకాలుగా శల్యపరీక్షలు పెట్టినా.. ఒడిదుడుకులెదురైనా తట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలి ఏడాదిని తడబడుతూనే ముగించింది.
కానీ ఈ తొలి ఏడాది తడబాటుకు కాంగ్రెస్ సర్కారుకు మంచే చేసింది. ఆ తడబాటు నుంచి ఎలా నిలబడాలో పాఠాలు నేర్చుకుంది. ఏం చేస్తే వ్యవహారాలు సాఫీగా సాగుతాయో అవగాహన తెచ్చుకుంది. రెండో ఏడాది నుంచి ప్రణాళిక ప్రకారం పాలన సాగించటానికి తొలి ఏడాది తలపోట్లే బాగా ఉపకరించాయి. ఓటమి గెలుపుకు బాటలు వేస్తుందన్న సూత్రాన్ని నమ్మిన కాంగ్రెస్ మొదట ఎన్నికల్లోనూ.. తర్వాత పాలనలోనూ కూడా ఆ మాట అక్షరసత్యమని నిరూపించింది.
సంక్షేమం విషయంలో కాంగ్రెస్ మెజార్టీ హామీలు నిలబెట్టుకుంది. ఒకటీ అరా హామీలు నెరవేర్చాల్సి ఉందని చెబుతూ.. తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఆదాయం పెరిగేదాన్ని బట్టి.. మిగతా హామీలు కూడా అమలు చేస్తామని చెప్పటం.. ప్రజల్లోకి బాగానే వెళ్లింది. ఉద్యోగాల భర్తీతో.. నిరుద్యోగుల మనసు కూడా గెలుచుకుంది.
సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ సర్కారు ఊరటనిచ్చింది. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు ఉచిత కరెంట్, రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ చీరలు, సన్నబియ్యం, రేషన్ కార్డులు ఇలా ఇవన్నీ విజయవంతంగా అమలు చేయడం వల్ల.. ప్రజల్లో కాంగ్రెస్ సర్కారు పట్ల నమ్మకం పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు రాలేదనే అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులకు ఊరట ఇస్తూ.. భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది కాంగ్రెస్ సర్కారు. ఓవైపు పెండింగ్ లో ఉన్న ఉద్యోగాల భర్తీతో పాటు మరోవైపు ఉద్యోగాల నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో.. తెలంగాణ ఉద్యమ నినాదానికి సార్థకత చేకూరినట్టైంది. దీంతో పాటు విశ్వవిద్యాలయాల్ని పటిష్ఠం చేసే విధంగా నిధుల కేటాయింపు, బోధనా సిబ్బంది నియామకంలోనూ కదలిక వచ్చింది. ఇక మొత్తంగా విద్యావ్యవస్థనే సంస్కరించాలనే సదుద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల విధానం తీసుకొచ్చింది. పలుచోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. ఓ లక్ష్యం పెట్టుకుని స్కూళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని కూడా సర్కారు సంకల్పించింది. ఆమేరకు బహిరంగ ప్రకటన కూడా చేసింది.
తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల్లో కొన్ని తప్ప మిగతావన్నీ అమలు చేసే ప్రయత్నం చేశారు. అనూహ్యంగా తెల్ల కార్డుపై సన్నబియ్యం ఇవ్వడం ప్రారంభించారు. ఈ స్కీమ్‌కు భారీగా స్పందన వచ్చింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. చాలా ప్రాంతాల్లో పేదలు సన్నబియ్యం వండుకుని.. ప్రజాప్రతినిధులకు భోజనాలు పెట్టిన పండగ వాతావరణం కనిపించింది. ఇక రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. రైతు బంధు డబ్బులు కూడా పడటంతో.. అన్నదాతల్లోనూ నమ్మకం పెరిగింది. అయితే పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఇవ్వడం, తులం బంగారం వంటి హామీలు ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఆర్థిక పరిమితులు రేవంత్ కు గుదిబండగా మారాయి. అయితే ఆర్థిక పరిమితుల్ని హ్యాండిల్ చేస్తూనే.. క్రమంగా వెసులుబాటు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. వెసులుబాటు రాగానే మిగతా పథకాలు ఇస్తామన్న మంత్రుల మాటలకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తోంది.
మెజార్టీ సంక్షేమ పథకాలు ఇస్తున్నా.. అందుకోసం ఎంత కష్టపడాల్సి వస్తుందో కూడా మంత్రులు ప్రజలకు తెలియజెబుతున్నారు. దీంతో మిగతా హామీల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తేలిపోతున్నాయి. సంక్షేమం విషయంలో ఒక్కో పథకం లక్ష్యం ఏంటో వివరిస్తూ.. తమ చిత్తశుద్ధిని జనం ముందు నిరూపించుకుంది కాంగ్రెస్ సర్కారు. రెండేళ్లుగా పథకాల అమలుకు.. అభివృద్ధి పనుల కోసం నిధుల సవాళ్లతో సతమతమవుతూనే ఉన్నారు. అప్పులు తెచ్చి..భూములు అమ్మి ఎక్కడిక్కకడ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. అయితే ఏదేమైనా తెలంగాణ బాగు కోసమే తాము పనిచేస్తున్నామని, వ్యక్తిగత అజెండాల్లేవని ప్రజాప్రభుత్వం సంకేతాలు పంపగలిగింది. దీనికి తోడు ఆర్థిక కష్టాలున్నా పథకాలు ఇస్తున్నారనే మంచి పేరు కూడా తెచ్చుకోగలిగింది.
కాంగ్రెస్ ఎక్కడోచోట విఫలమవుతుంది.. మనకు ఛాన్స్ ఇస్తుందని చూసిన విపక్షాలకు అడుగడుగునా నిరాశే ఎదురైంది. ఎక్కడ దొరికినా, దొరక్కపోయినా.. సంక్షేమం విషయంలో బుక్కైపోతారనుకున్న అంచనాలు కూడా నిజం కాలేదు. సంక్షేమం విషయంలో ప్రతిపక్షాలు ట్రాప్ వేసి రెడీగా ఉన్నాయని తెలిసే.. కాంగ్రెస్ సర్కారు చాలా నేర్పుగా వ్యవహరించింది. ఎప్పటికప్పుడు పథకాలపై వచ్చిన విమర్శల్ని తిప్పికొడుతూ.. పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చాటింది.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణను, బీసీ జనగణను పూర్తిచేయడం.. తెలంగాణ సర్కారుకు ఆయా వర్గాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ ప్రక్రియల్లో ఎదురైన అవాంతరాలను ఎదుర్కుంటూ.. చివరకు అనుకున్న విధంగా పనులు చేయగలిగింది. ఎస్సీ వర్గీకరణ సాహసోపేత ప్రయత్నంగా నిలిస్తే.. బీసీ జనగణన దేశానికే ఆదర్శమని చెప్పుకునే అవకాశం వచ్చింది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే.. అభివృద్ధి విషయంలోనూ నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళికలు రచించింది కాంగ్రెస్ సర్కారు. మిషన్ మోడ్‌లో అభివృద్ధి చేయటానికి ఆర్థిక పరిమితులు ఉండటంతో.. మొదట ప్లానింగ్ పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, ఆర్ఆర్ఆర్ వంటి వినూత్న ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఆర్ఆర్ఆర్ ను చేపట్టేలా కేంద్రాన్నిఒప్పించగలిగింది. ఫ్యూచర్ సిటీ విషయంలో రాష్ట్ర సర్కారు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి.. గ్లోబల్ సమ్మిట్‌ను కూడా అక్కడే నిర్వహించి..
దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయగలిగింది. ఇటు కేంద్రం నుంచి కూడా నిధులు ఆశిస్తోంది. మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో కూడా దశలవారీగా అడుగు ముందుకేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇలా సంక్షేమం, అభివృద్ధి దేన్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదనే ఉద్దేశంతో ఉంది తెలంగాణ సర్కారు.
తొలి ఏడాదిలో ఎక్కడ గ్యాప్ వచ్చిందో అనుభవపూర్వకంగా తెలుసుకుంది కాంగ్రెస్ సర్కారు. అందుకే రెండో ఏడాది వచ్చేసరికి ఆ గ్యాప్ త్వరగానే పూడ్చుకుని.. అన్నిరకాలుగా కుదురుకుంది. సర్కారుకు ఏం కావాలో యంత్రాంగానికి కూడా క్లారిటీ రాకపోవడంతో.. చాలా వరకు సమస్యలు తగ్గిపోయాయి. రెండో ఏడాది ముగిసే సమయంలో వచ్చిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు కూడా కాంగ్రెస్ కు కిక్ ఇచ్చింది.
తొలి ఏడాదిలో కాంగ్రెస్ పాలనను పదేపదే బీఆర్ఎస్‌తో పోల్చి.. అంత లేదనే భావన కనిపించింది. కానీ రెండో ఏడాది వచ్చేసరికి.. పాలనలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది. గతానికి భిన్నంగా కాంగ్రెస్ సర్కారు అధికార యంత్రాంగంపై పట్టు సాధించి.. తాను అనుకున్నట్టుగా పనులు చేయగలిగింది. వేగవంతమైన కార్యాచరణను అమలులో పెట్టింది. దీంతో అప్పటిదాకా సర్కారుపై ఉన్న అపోహలు తొలగిపోయి.. కాంగ్రెస్ సర్కారు కుదురుకుందనే పేరొచ్చింది. అదే సమయంలో మంత్రుల విషయంలో విభేదాలు వచ్చే పరిస్థితులు తలెత్తినా.. వాటిని ఆదిలోనే పరిష్కరించుకుని కాంగ్రెస్ సర్కారు స్థిరంగా ముందడుగు వేయగలిగింది. అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. ఎవరేం చెప్పినా.. తమ అజెండాకు మాత్రమే పరిమితమై పనిచేయడం, పరిధులు దాటకపోవడంతో.. సీఎం సహా మంత్రులంతా ఓ కట్టుబాటుతో పనిచేసుకుంటూ వచ్చారు. ఈ వ్యూహం విజయవంతమైందని రెండేళ్ల పాలన నిరూపించింది.
పరిపాలన, పథకాలు, ప్రణాళికలు, రాజకీయ అజెండా.. ఇలా ప్రతి అంశంలోనూ రెండో ఏడాదిలో కాంగ్రెస్ సర్కారు స్పష్టమైన అవగాహనను, నిలకడను తెచ్చుకోగలిగింది. పనిలోపనిగా కేంద్రంతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూ.. పాలన వేరు, రాజకీయం వేరు అనే సందేశం ఇచ్చింది. రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన ప్రధానమంత్రిని.. పాలనా వ్యవహారాల్లో అవమానించాల్సిన పని లేదని స్వయంగా సీఎం చెప్పడం.. మంత్రులు కూడా ఎవరి శాఖల విషయంలో వారు.. కేంద్ర మంత్రుల్ని తరచుగా కలుస్తూ సుహృద్భావ వాతావరణం ఏర్పరచడం కాంగ్రెస్ సర్కారుకు కలిసొచ్చింది. ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయని ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు చేసింది. కాకపోతే వాటిని కాంగ్రెస్ తేలిగ్గానే తిప్పికొట్టగలిగింది. గత బీఆర్ఎస్ పాలనతో జరిగిన తప్పులపై సాగుతున్న విచారణలు కూడా ఆ పార్టీని డిఫెన్స్‌లో పడేశాయి. ఫోన్ ట్యాపింగ్ దగ్గర్నుంచి కాళేశ్వరం దాకా.. ప్రతి విషయంలో జరిగిన తప్పుల్ని, అందుకు కారణాల్ని సవివరంగా ప్రజల ముందు పెట్టిన కాంగ్రెస్ సర్కారు.. పగ తీర్చుకోవటం తమ ఉద్దేశం కాదని హుందాగా వ్యవహరించింది. దీంతో ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో.. ప్రస్తుత సర్కారు వ్యవహారాన్ని పోల్చి చూసుకున్నారు.
కానీ ఎన్ని పనులు చేసినా.. ఎంత సమన్వయంతో వ్యవహరించినా.. కాంగ్రెస్ రాజకీయంగా బలహీనంగా ఉందని ప్రతిపక్షాలు గట్టిగా ప్రచారం చేశాయి. అప్పటికే కంటోన్మెంట్ ఉపఎన్నికలో గెలిచినా.. అది పెద్ద లెక్కలోకి రాదన్నట్టుగా విపక్షం మాట్లాడింది. ఆ అభిప్రాయంతోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కాంగ్రెస్ పాలనకు రిఫరెండంగా ప్రతిపక్షమే ప్రకటించింది. దీంతో ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్.. సమష్టి బాధ్యత తీసుకుని ప్రణాళిక ప్రకారం పనిచేసింది. ప్రభుత్వం చేసిన పనుల్ని ఓటర్లకు వివరించడంలో విజయవంతమైంది. సర్కారు కార్యక్రమాలు వర్గాల వారీగా ఎలా మేలు చేశాయో చెప్పి.. ప్రతిపక్షాల ఊహకు అందని ప్రచార వ్యూహం అవలంబించింది. దీంతో ఓటర్లు కూడా కాంగ్రెస్ కు పెద్ద ఎత్తున మద్దతిచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు.. రేవంత్‌కు, కాంగ్రెస్‌కు కొత్త శక్తిని ఇచ్చింది. నిన్న మొన్నటివరకు వాలటైల్‌గా ఉన్న పరిస్థితి నుంచి .. కాంగ్రెస్ అంత వీక్ కాదు అనే భావన నెలకొంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సమష్టిగా కృషి చేసి.. ఎలక్షనీరింగ్ చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని సాధించింది. సమష్టిగా చేయగలిగితే, పార్టీ మరోసారి కూడా అధికారంలోకి రాగలదని.. నాయకుల్లో ఆశ పెరిగింది. జూబ్లీహిల్స్ గెలుపు ఇచ్చిన కొత్త ఉత్సాహంతో .. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లింది రేవంత్ సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికలు అంచెల ప్రకారం చేస్తూ.. మొదట పంచాయితీలు, తర్వాత జడ్పీటీసీ , ఎంపీటీసీలు, తర్వాత జీహెచ్‌ఎంసీ.. ఇలా ఒక ఆర్డర్‌లో ప్లాన్ చేయడం ద్వారా.. కాంగ్రెస్ తన వ్యూహాన్ని బలంగా అమలు చేసుకోగలుగుతుంది. ప్రభుత్వంలో ఒకటి అరా తప్పులు జరిగినప్పటికీ, రాష్ట్రంలో ఒక స్థిరమైన వాతావరణం తీసుకురాగలిగింది కాంగ్రెస్.. ఆ పార్టీ నాయకులు.
మరో టర్మ్ అధికారం తమదే అనే నమ్మకంతో కనిపిస్తోంది కాంగ్రెస్. అయితే దాన్ని సాకారం చేసుకోవాలంటే వచ్చే మూడేళ్లు చాలా కీలకం. గొప్పగా మేలు చేయకపోయినా.. కీడు చేయలేదని.. అహంకారంతో పాలన చేయలేదని ప్రజలు అనుకునేలా చేసుకోగలిగితే.. అనుకున్నలక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ముందడుగు పడాలంటే.. ఈ రెండేళ్లకు మించి పాలన చేయాల్సి ఉంటుంది.
