తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రం ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను ఆకట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచి హామీల అమలు దిశగా ముందడుగు వేసింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాలన మొదలుపెట్టి.. ఆరోగ్యశ్రీ పరిమితి కూడా పెంచి హామీల విషయంలో వెనకడుగు లేదని చాటుకుంది.
CM Revanth Reddy : నారాయణపేట “ప్రజా పాలన- ప్రగతి బాట”బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు అని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామని, పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను కెసిఆర్ ఎందుకు పూర్తి…