లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకంపై స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను, తప్పుడు ప్రచారాలను తోసిపుచ్చుతూ.. వక్ఫ్ బోర్డులో ముతవల్లీ ముస్లిం మాత్రమే ఉంటారని తెలిపారు. అన్యమతానికి చెందిన ఏ సభ్యుడినీ అనుమతించబోమని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం.. వక్ఫ్ బోర్డులోని ముస్లిమేతరులు మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోరని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈపీఐసీ (EPIC)ని ఆధార్‌తో లింక్ చేయడం కోసం ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. త్వరలో యుఐడీఏఐ(UIDAI), కేంద్ర ఎన్నికల సంఘం నిపుణుల మధ్య సాంకేతిక సంప్రదింపులు ప్రారంభం కానున్నాయి.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియ ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ప్రధానిపై ఒత్తిడి పెరగనుందని, అన్ని రాష్ట్రాల్లో కూడా కుల గణన చేయాలని డిమాండ్ రాబోతోందని తెలిపారు. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. భవిష్యత్‌లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే డాక్యుమెంట్ దేశానికి…