మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్లోకి అడుగుపెట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత ప్లేఆఫ్స్ సమీకరణాలు సంక్లిష్టంగా మారే ప్రమాదాన్ని ఎదుర్కొన్న స్మృతి మంధాన సేన, కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించి, టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్ చేరింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ..…