Worst Records Created By Team India After Big Loss Against Australia: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఎంత దారుణమైన ఓటమిని చవిచూసిందో అందరికీ తెలిసిందే! బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ ఘోరంగా విఫలమైంది. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి భారత జట్టు పేకమేడల్లా కుప్పకూలింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (31), ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (29 నాటౌట్) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా వాళ్లందరూ తీవ్రంగా నిరాశపరిచారు. మొత్తం ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వగా.. అందులో నలుగురు డకౌట్ అయ్యారు. దీంతో.. భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51), మిచెల్ మార్ష్ (66) మెరుపు బ్యాటింగ్‌తో పరుగుల వర్షం కురిపించి.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని సాధించారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా తన పేరిట కొన్ని చెత్త రికార్డుల్ని నమోదు చేసుకుంది.
Bhanushree Mehra: బన్నీ ‘బ్లాక్’ వివాదం.. పెగ్గేస్తూ వివరణ ఇచ్చిన భానుశ్రీ
టీమిండియాకు వన్డేల్లో సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు.. 1986లో శ్రీలంకతో మ్యాచ్‌లో 78, 1993లో వెస్టిండీస్‌తో 100, 2017లో శ్రీలంకతో 112 అత్యల్ప స్కోర్లను భారత్ నమోదు చేసింది. ఇప్పుడు నాలుగోసారి 117 స్కోరుకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌ని ఆస్ట్రేలియా జట్టు 39 ఓవర్లు (234 బంతులు) మిగిలి ఉండగానే ముగించింది. దీంతో.. బంతుల పరంగా భారత్‌కి ఇది అతిపెద్ద ఓటమిగా నిలిచింది. స్వదేశంలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇది రెండోసారి. 2020లోనూ ఆస్ట్రేలియా చేతిలోనే భారత్ తొలిసారి 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఓవరాల్‌గా చూసుకుంటే.. ఆరోసారి ఈ మేరకు ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. 1981లో న్యూజిలాండ్, 1997లో వెస్టిండీస్, 2000, 2005లో సౌతాఫ్రికా చేతిలో ఓటమిని మూటగట్టుకున్న భారత్.. 2020లో, ఇప్పుడు మళ్లీ ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడింది. ఇక స్వేదశంలో పేసర్లకే భారత్ 10 వికెట్లు కోల్పోవడం ఇది రెండోసారి. 2009లో గువాహటిలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ పేస్ బౌలర్లు ఈ ఘనత సాధించారు.
Tollywood: వీళ్లలో ఒకడుంటేనే రచ్చ ఉంటది… ఇద్దరూ ఒక దగ్గరే ఉంటే అంతే ఇక…