బంగ్లాదేశ్‌ను 3 పరుగుల తేడాతో ఓడించిన వెస్టిండీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో భాగంగా షార్జాలో జరిగిన బంగ్లాదేశ్-వెస్టిండీస్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరకు వెస్టిండీస్ జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. వెస్టిండీస్ టాపార్డర్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4), హెట్‌మెయిర్ (9), ఆండ్రీ రస్సెల్ (0) విఫలమయ్యారు. బ్యాటింగ్ చేస్తూ మధ్యలో మైదానాన్ని వీడిన కెప్టెన్ పొలార్డ్ మళ్లీ వచ్చి బ్యాటింగ్ కొనసాగించాడు. పొలార్డ్ ఆట చివరికి 14 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అటు లోయరార్డర్ లో వచ్చిన నికోలస్ పూరన్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 22 బంతులు ఎదుర్కొన్న పూరన్ 1 ఫోర్, 4 సిక్సర్లు బాదాడు. రోస్టన్ చేజ్ 39 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 2, ముస్తాఫిజుర్ 2, ఇస్లామ్ 2 వికెట్లు తీశారు.
Read Also: పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా సారా టేలర్
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
అనంతరం 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను 139/5 స్కోరే చేయగలిగింది. ఓపెనర్‌గా వచ్చిన షకీబ్ (9) విఫలమయ్యాడు. లిట్టన్ దాస్ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. దాస్ (44), కెప్టెన్ మహ్మదుల్లా (31) పోరాడినా విజయం మాత్రం దక్కలేదు. విండీస్ బౌలర్లలో రాంపాల్, హోల్డర్, బ్రావో, రసెల్, హుస్సేన్‌లకు తలో వికెట్ దక్కింది. కాగా ఈ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు ఇదే తొలి విజయం.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!