జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ గా ఇన్ని రోజులు ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు భారత జట్టు యొక్క ప్రధాన హెడ్ కోచ్ గా మారిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఎన్‌సీఏ హెడ్ స్థానంలోకి ఎవరు వస్తారు నేచర్చ బాగా జరిగింది. ఆ పదవికి వినిపించిన పేర్లలో వీవీఎస్ లక్ష్మణ్ పేరే ఎక్కువగా ప్రచారం అయింది. అయితే ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెర దించుతూ… ఎన్‌సీఏ హెడ్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ రోజు ప్రకటించాడు. అయితే అంతకముందు బీసీసీఐ వర్గాలు తెలిపిన ప్రకారం… కేవలం బీసీసీఐ చీఫ్ కుమాత్రమే కాకుండా, సెక్రటరీ జే షా మరియు ఇతర సీనియర్ అధికారులు కూడా లక్ష్మణ్ ఎన్‌సీఏ పాత్రను చేపట్టాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు అదే నిజం అయ్యింది.