ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ప్లేఆఫ్స్ కి చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లోనూ ఆర్సబీ మిడిల్ ఆర్డర్ కూప్పకూలింది. ఈ సీజన్ లో ఆర్సీబీ బ్యాటింగ్ భారాన్ని మోసిన ఫాప్ డుప్లెసిస్,గ్లెన్ మ్యాక్స్ వెల్ త్వరగా అవుట్ అయినా విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్సింగ్స్ తో ఒంటరి పోరాటం చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగుుల చేసింది. 220+ పరుగులు చేసినా కాపాడుకోవడం కష్టంగా ఉండే చిన్నస్వామి స్టేడియంలో ఈ స్కోరు ఏమాత్రం సరిపోతుందా అనేది చూడాలి..
Also Read : Brahmanandam: ఘనంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థం
తొలి వికెట్‌కి ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఒకే సీజన్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా వీరు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇంతకుముందు 2016 సీజన్‌లో కోహ్లీ – ఏబీడీ కలిసి 939 పరుగులు చేయగా ఆ రికార్డుని ఫాఫ్ – కోహ్లీ ఈ సీజన్ లో బ్రేక్ చేశారు. 19 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
Also Read : Mumbai : ముంబయి లోకల్ ట్రైన్‌లో డెయిలీ ప్రయాణిస్తున్న కుక్క
3 బంతుల్లో 1 పరుగు చేసిన మహిపాల్ లోమ్రోర్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 67/0 స్కోరుతో ఉన్న ఆర్‌సీబీ, 2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 85/3కి చేరింది. 16 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన మైకేల్ బ్రాస్‌వెల్, షమీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి డగౌట్ కు చేరాడు. దినేశ్ కార్తీక్, యశ్ దయాల్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ కాగా.. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో విరాట్ కోహ్లీ దూకుడు తగ్గించకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్.. 60 బంతుల్లో సెంచరీ చేశాడు.
Also Read : Pawan Kalyan: మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి.. ఎమోషనల్ అయిన మెగా బ్రదర్స్
2020 సీజన్‌లో శిఖర్ ధావన్, 2022 సీజన్‌లో జోస్ బట్లర్ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్‌లో ఏడో సెంచరీతో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ తరంలో 75 సెంచరీలు చేసి, అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లోనూ అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డులు నెలకొల్పడం విశేషం. విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 101 పరుగులు చేయగా అనుజ్ రావత్ 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి ఆర్‌సీబీకి 197 పరుగుల స్కోరు అందించారు. ఇక 198 పరుగుల లక్ష్యంతో గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగింది.