సినిమా హీరోలకు, హీరోయిన్లకు మాత్రమే కాదు.. క్రికెటర్లకు కూడా వీరాభిమానులు ఉంటారు.. అంతేకాదు వారిపై అమితమైన ప్రేమతో ప్రత్యేకమైన ముఖ చిత్రాలను తయారు చేస్తుంటారు.. కొందరు పెయింటింగ్ వేస్తే.. మరికొందరు రకరకాల వాటితో అద్భుతమైన చిత్రాన్ని గీస్తుంటారు.. తాజాగా ఓ వ్యక్తి అలాగే అద్భుతాన్ని సృష్టించాడు.. భూతద్దంతో విరాట్ కోహ్లీ అద్భుతమైన చిత్రంను గీసాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు చెక్కపై పెన్సిల్‌తో ముందుగానే విరాట్ కోహ్లి చిత్రాన్ని గీసినట్లు కనిపిస్తుంది. దాన్ని ఎండలోకి తీసుకెళ్లి భూతద్దం ద్వారా సూర్యకిరణాలు ద్వారా చెక్క ఉపరితలం కాలేలా చేశాడు. అయితే.. ఇందుకు చేతిని ఒకే స్థితిలో ఉంచాల్సి ఉంటుంది. బాగా ఓర్పు, ఏకాగ్రత అవసరం. ఎంతో కఠినమైన ఈ పనిలో ఏదైన తప్పు జరిగినా కూడా అప్పటి వరకు పడిన శ్రమ వృథా అవుతుంది. ఆ వ్యక్తి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కోహ్లీ ముఖాన్ని చక్కగా గీసాడు..
ఆ బొమ్మను పూర్తి చెయ్యడానికి ఎన్ని రోజులు సమయం పట్టిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.. కానీ మూడు, నాలుగు రోజులు పట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అచ్చు గుద్దినట్లు విరాట్ ముఖ చిత్రాన్ని దించేసాడు.. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఇది చూసిన నెటిజన్లు విరాట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోను మీరు చూసి ఓ కామెంట్ వేసుకోండి..