Virat Kohli: అక్కడ డబుల్ సెంచరీ.. ఆ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈమధ్యకాలంలో ఫామ్‌లో లేడన్న సంగతి అటుంచితే.. ఇప్పటివరకూ కెరీర్‌లో అతడు ఎన్నో ఘనతల్ని సాధించాడు. పాత రికార్డుల బూజు దులిపేసి, ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులెన్నో నమోదు చేశాడు. కేవలం మైదానంలోనే కాదండోయ్, సోషల్ మీడియాలోనూ ఇతనికి తిరుగులేదు. బ్యాట్‌తో రికార్డుల ఖాతాని ఎప్పట్నుంచి తెరిచాడో, అప్పట్నుంచే కోహ్లీకి నెట్టింట్లో ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్‌లో 200 మిలియన్ మార్క్‌ని దాటేశాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ చరిత్రపుటలకెక్కాడు. ఈ సందర్భంగా కోహ్లీ స్పందిస్తూ.. ‘‘200మిలియన్ స్ట్రాంగ్. ఇంత భారీ మద్దతు ఇస్తున్నందుకు ఇన్‌స్టా ఫ్యామిలీకి ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇన్‌స్టాలో అత్యధిక పాలోయింగ్ కలిగిన క్రీడాకారుల్లో తొలి రెండు స్థానాల్లో ఫుట్ బాల్ దిగ్గజాలైన క్రిస్టియానో రొనాల్డో (450 మిలియన్ల ఫాలోవర్లు), లియోనెల్ మెస్సీ (333 మిలయన్ల ఫాలోవర్లు) ఉన్నారు. ఆ ఇద్దరి తర్వాత హయ్యస్ట్ ఫాలోవర్స్ గల క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
కాగా.. గతేడాదిలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ వైఫల్యం తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత వన్డే, అనంతరం టెస్టులకు కూడా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. కెప్టెన్సీ భారం మోయలేక తాను తన ఆటపై పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోతున్నానని, అందుకే నాయకత్వ బాధ్యతలకు స్వస్తి పలుకుతున్నానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!