టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈమధ్యకాలంలో ఫామ్‌లో లేడన్న సంగతి అటుంచితే.. ఇప్పటివరకూ కెరీర్‌లో అతడు ఎన్నో ఘనతల్ని సాధించాడు. పాత రికార్డుల బూజు దులిపేసి, ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులెన్నో నమోదు చేశాడు. కేవలం మైదానంలోనే కాదండోయ్, సోషల్ మీడియాలోనూ ఇతనికి తిరుగులేదు. బ్యాట్‌తో రికార్డుల ఖాతాని ఎప్పట్నుంచి తెరిచాడో, అప్పట్నుంచే కోహ్లీకి నెట్టింట్లో ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్‌లో 200 మిలియన్ మార్క్‌ని దాటేశాడు. ఈ ఘనత…