ప్రస్తుతం భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అనుకున్న విధంగా రాణించలేక పోతున్నాడు. పరుగులు చేయక అభిమానులను నిరాశపరుస్తున్నాడు. దాంతో అతడిని జట్టు నుండి తొలగించాలని విమర్శలు భారీగా వస్తున్నాయి. అయితే ఈ విషయంలో రహానేకు కెప్టెన్ కోహ్లీ మద్దతు ఇచ్చాడు. తాజాగా రహానే గురించి మాట్లాడుతూ… నేను అతని ఫామ్‌ను అంచనా వేయలేను… దాని గురించి ఎవరు ఏం చెప్పలేరు. దానిని ఎలా మెరుగు పరుచుకోవాలి అనేది అతనికి మాత్రమే తెలుస్తుంది. ఈ సమయంలో మన చేయాల్సింది కేవలం అతనికి మద్దతు ఇవ్వడం మాత్రమే అని కోహ్లీ అన్నాడు. ఇక ఈ ఫామ్ కారణంగా భారత జట్టు వెళ్లనున్న సౌథ ఆఫ్రికా పర్యటనకు కూడా రహానే దూరం కానున్నాడు అని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు/