టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడి వాతావరణం సందడిగా ఉంటుంది. మైదానంలో లేదా బయట ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా అతని ప్రవర్తన ఒకేలా ఉంటుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం దొరికిన విరామాన్ని కోహ్లీ ఎంజాయ్ చేస్తున్నాడు. ముంబైలో నార్వే డ్యాన్సర్లతో కలిసి కోహ్లీ చిందేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read : Off The Record: అక్కడ కమలంలో ఆధిపైత్యపోరు
క్విక్ స్టైల్ అనే నార్వే డ్యాన్స్ టీమ్ ముంబైలో ఒక ప్రొగ్రామ్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ లో కోహ్లీ సందడి చేశాడు. క్విక్ స్టైల్ బృందంలోని ఒక వ్యక్తి క్రికెట్ బ్యాట్ ను ఎత్తి ఏం చేయాలో ఆలోచిస్తుంటాడు. ఇంతలో వైట్ షర్ట్, నల్ల ప్యాంటు వేసుకున్న కోహ్లి సీన్ లోకి ఎంటరవుతాడు. ఈ క్రమంలో నార్వే బృందం ఇష్క్, స్టీరియో నేషన్స్ పాటలకు పాడుతుండగా కోహ్లీ బ్యాట్ పట్టుకుని మ్యూజిక్ కు తగినట్టుగా డ్యాన్స్ చేశాడు. కోహ్లినే అనుసరించిన నార్వే డ్యాన్సర్లు స్టెప్పులతో అలరించారు. ఈ వీడియోను కోహ్లి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. పోస్ట్ పెట్టిన గంటలోనే 5.4 లక్షల లైకులు, 2 మిలియన్ల మంది చూశారు. కోహ్లి స్టెప్పులను మెచ్చుకుంటూ అతని భార్య అనుస్క శర్మ ఎమోజీ పోస్టును షేర్ చేసింది.
Also Read : Groom Called Of Marriage: తక్కువ మార్కులొచ్చాయని పెళ్లి రద్దు.. తీరా చూస్తే ఊహించని ట్విస్ట్!
ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి సెంచరీతో మెరిశాడు. 186 పరుగులతో రాణించిన కోహ్లి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా తరపున కోహ్లి, శుభ్ మన్ గిల్ శతకాలు బాదడంతో భారీ స్కోర్ చేసింది. అయితే పిచ్ బ్యాంటింగ్ కు అనుకూలంగా ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొని వరుసగా నాలుగోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని అట్టిపెట్టుకుంది. మ్యాచ్ డ్రా చేసుకున్నప్పటికి కివీస్ చేతిలో శ్రీలంక పరాజయం పాలవ్వడంతో టీమిండియా డబ్య్లూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక ఇరుజట్ల మధ్య మూడు వన్డే సిరీస్ మార్చ్ 17 నుంచి ప్రారంభం కానుంది.