Virat Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మలు కలిసి లండన్ లో విహరిస్తున్నారు. ఇద్దరూ కలిసి కృష్ణ దాస్ కీర్తనలకు హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. కుమార్తె వామికతో కలిసి ఇద్దరు కనిపించారు. కృష్ణదాస్ హిందూ భక్తి గీతాలకు ప్రసిద్ధి చెందిన అమెరికన్ సింగర్. గత ఏడాది కూడా ఆయన కీర్తనలకు కోహ్లీ, అనుష్క జోడి హాజరయ్యారు. ఈ నెలలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిష్ మ్యాచ్ లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది.
ఇదిలా ఉంటే ఆటతో పాటు విరాట్ కోహ్లీ సంపాదనలో ‘కింగ్’ గానే ఉన్నారు. ఆయన నెట్ వర్త్ రూ.1000 కోట్లను దాటింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన, ప్రజాదరణ పొందిన క్రీడాకారుల జాబితాలో కోహ్లీ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 252 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే అంతర్జాతీయ క్రికెట్లరలో సంపాదనపరంగా కోహ్లీ టాప్ లో ఉన్నారు. టీమ్ ఇండియాలో A+ కాంట్రాక్టు ఉన్న కోహ్లీ దీని ద్వారా ఏడాదికి రూ.7 కోట్లు సంపాదిస్తున్నాడబు. ఒక్కో టెస్టు మ్యాచ్ కి రూ.15 లక్షలు, వన్డేకి రూ. 6 లక్షలు, టీ 20కి రూ. లక్షలు సంపాదిస్తున్నాడు. దీంతో పాటు ఆర్సీబీ కాంట్రాక్టు ద్వారా ఏడాదికి రూ. 15 కోట్లు ఆర్జిస్తున్నాడు. దీంతో పాటు పలు బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
Virat Kohli And @AnushkaSharma Attended @KrishnaDas' Kirtan At Union Chapel, London Yesterday.❤️#Virushka @imVkohli pic.twitter.com/7fpoFkZ6EM
— virat_kohli_18_club (@KohliSensation) June 17, 2023