Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
- వైభవ్ సూర్యవంశీపై క్లైవ్ లాయిడ్ ప్రశంసల వర్షం
- వైభవ్ ప్రత్యేకమైన ప్రతిభ కలవాడు
- భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడు
- అధికారులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Clive Lloyd’s Advice to Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై వెస్టిండీస్ దిగ్గజ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్.. భవిష్యత్తులో మరింత పెద్ద స్టార్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న వివాదంపై బుడ్డోడికి ఓ కీలక సూచన చేశాడు. వైభవ్ శ్రీలంక ఆటగాళ్లతో ధీటుగా స్పందించడం కంటే.. అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.
ప్రత్యేకమైన ప్రతిభ కలవాడు:
రెవ్స్పోర్ట్జ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లైవ్ లాయిడ్ మాట్లాడుతూ.. ‘యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు పలకడం కాస్త కష్టమే. కానీ అతను చాలా ప్రత్యేకమైన ప్రతిభ కలవాడు. వైభవ్ బంతిని ఎంతో సులభంగా బౌండరీ, సిక్సర్లకు తరలిస్తాడు. అతను స్లాగర్ కాదు.. టెక్నిక్‌తో, టైమింగ్‌తో భారీ షాట్లు ఆడతాడు. వైభవ్ ఆటను మార్చే ప్రయత్నం చేయకుండా అలాగే కొనసాగనివ్వాలి. భవిష్యత్తులో అతడిని ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. పెద్ద స్టార్ అవుతాడు’ అని ప్రశంసించాడు.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
లంక ఆటగాడిని తోసేసిన వైభవ్:
ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అంతకుముందే లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన అతడు.. ఫైనల్లోనూ విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్-ఏ జట్టుకు టైటిల్ అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో మరోసారి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అయితే లీగ్ దశలో శ్రీలంక-ఏతో జరిగిన ఒక మ్యాచ్‌లో వైభవ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. ప్రత్యర్థి ఆటగాడు స్లెడ్జింగ్ చేయడంతో కోపానికి గురైన వైభవ్.. లంక ఆటగాడిని తోసేశాడు. ఈ సంఘటనపై స్పందించిన క్లైవ్ లాయిడ్.. వైభవ్ ధీటుగా స్పందించడం కంటే అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.
రిఫరీలు, అంపైర్లు ఉంటారు:
‘ఆటలో అలాంటి సందర్భాల కోసం మ్యాచ్ రిఫరీలు, అంపైర్లు ఉంటారు. ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే వెంటనే రిఫరీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి. క్రికెట్ నిబంధనల్లో ప్రత్యర్థిని రెచ్చగొట్టడం అనుమతించబడదు. కాబట్టి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థితో ఘర్షణ పడకుండా అధికారులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది’ అని క్లైవ్ లాయిడ్ పేర్కొన్నాడు. వైభవ్ ప్రస్తుతం భారత క్రికెట్లో యువ ప్రతిభగా గుర్తింపు పొందుతున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శనలతో 776 పరుగులు చేసిన అతడు.. త్వరలో ఐర్లాండ్ పర్యటనలో భారత సీనియర్ జట్టుకు అరంగేట్రం చేసే అవకాశముంది. అతడి దూకుడు ఆటతీరు అభిమానులను ఆకట్టుకుంటున్నప్పటికీ.. మైదానంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం కూడా అంతే ముఖ్యమని క్లైవ్ లాయిడ్ సూచించాడు.
తాజావార్తలు
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!