Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Tractors: డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు వాడటం వల్ల 84 శాతానికి పైగా ఖర్చు తగ్గుతుందంటే నమ్ముతారా? అవును, ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియా, అగ్రికల్చర్ సెక్టార్లో పెద్ద చర్చగా మారింది. మనదేశంలో ఈ మధ్య ఎలక్ట్రిక్ బైక్‌లు, ఈ- కార్లు బాగానే కనిపించినా.. వ్యవసాయం అనగానే ఇప్పటికీ అంతా ఆ డీజిల్ ట్రాక్టర్ల వైపే చూస్తున్నారు. అయితే, మన వ్యవసాయ రంగంలోకి ఈ-ట్రాక్టర్లు వస్తే సీన్ ఎలా ఉంటుందనే దానిపై ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ (ICCT) అనే సంస్థ ఒక ఇంట్రెస్టింగ్ సర్వే చేసింది. ఈ సర్వేలో తేలిన విషయాలు చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఈ ఐసీసీటీ సంస్థ దాదాపు 11 నెలల పాటు నాలుగు వేర్వేరు కంపెనీలకు చెందిన ఐదు ఎలక్ట్రిక్ ట్రాక్టర్లతో ప్రాక్టికల్‌గా స్టడీ చేసింది. పొలాల్లో దుక్కి దున్నడం, విత్తనాలు నాటడం, పంట కోత తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం, ఒక చోట నుంచి మరో చోటికి సరుకులు మోయడం.. ఇలా రైతులు రోజువారీగా చేసే పనులన్నింటినీ ఈ ట్రాక్టర్లతోనే చేయించి రియల్ టైమ్ డేటాను సేకరించారు. చివరికి తేలిందేంటంటే డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల వల్ల ఏకంగా 64 నుంచి 84 శాతం వరకు ఎనర్జీ ఖర్చు ఆదా అవుతోందట. డీజిల్‌కు పెట్టే కొండంత ఖర్చుతో పోలిస్తే కరెంటు ఖర్చు చాలా తక్కువ కాబట్టి ఇది రైతులకు నిజంగానే బంపర్ ఆఫర్ అని చెప్పాలి.
Also Read
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
ప్రస్తుతం మన దేశంలో 25 నుంచి 50 హార్స్ పవర్ కేటగిరీ ఉన్న ట్రాక్టర్లకు కొన్ని కఠినమైన నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. దాంతో ఇవి పొలాల్లోనే కాకుండా ఇటుక బట్టీలు, మున్సిపాలిటీ పనుల వంటి రవాణాలో కూడా తెగ వాడేస్తున్నారు. దీనివల్ల ఢిల్లీ-ఎన్సీఆర్ లాంటి ప్రాంతాల్లో వాయు కాలుష్యం మరింత ఎక్కువైపోతోంది. అంతేకాదు, 2032 వరకు వీటిపై కఠినమైన రూల్స్ వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. అందుకే ఈ పరిస్థితిని మార్చడానికి ఐసీసీటీ కొన్ని పక్కా ప్లాన్లను, సలహాలను ప్రభుత్వానికి సూచించింది.
కేవలం వ్యవసాయానికి మాత్రమే కాకుండా మున్సిపల్ వెస్ట్ మేనేజ్మెంట్, ఎయిర్‌పోర్టుల్లో లగేజ్ మోసే పనులకు కూడా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను వాడేలా ప్రోత్సహించాలని ఐసీసీటీ ప్రతిపాదించింది. వాణిజ్యపరంగా వాడే ఈ-ట్రాక్టర్లకు కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఇస్తే వాడకం వేగంగా పెరుగుతుందని స్పష్టం చేసింది. దాంతో పాటు ప్రభుత్వ అనుమతి పొందిన అగ్రికల్చర్ మెషినరీ లిస్టులో క్వాలిటీ ఉన్న ఎలక్ట్రిక్ ట్రాక్టర్ మోడళ్లను త్వరగా చేర్చాలని కోరింది. రైతులు ఛార్జింగ్ కోసం ఇబ్బంది పడకుండా బ్యాటరీ స్వాపింగ్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి పైలట్ ప్రాజెక్టులు మొదలుపెట్టాలని, ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని కూడా రికమండ్ చేసింది.
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!