గాయం కారణంగా భారత జట్టు నుంచి తప్పుకున్న స్టార్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో త్వరలో జరిగే రెడ్ బాల్ సిరీస్‌లో భారత్-ఎ జట్టు తరఫున పంత్ బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్ ఎంపికయ్యాడు. గత జూలైలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లోని మాంచెస్టర్ టెస్ట్ (నాలుగో టెస్టు)లో పంత్ పాదానికి గాయమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 30న బెంగళూరులోని…
ఇండియా ‘ఎ’తో ఇంగ్లండ్ లయన్స్ జట్టు నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడనుంది. ఇండియా ఎతో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్ లయన్స్ 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కింది. 17 ఏళ్ల రాకీ 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌పై సెంచరీ చేయడంతో రాకీకి చోటు దక్కింది. యాషెస్ 2005…
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది. ఒమన్‌లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందు టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
దులీప్ ట్రోఫీ 2024 టైటిల్‌ను ఇండియా 'A' కైవసం చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఇండియా ఏ రెండింట్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. రెండు విజయాలతో ఈ జట్టు గరిష్టంగా 12 పాయింట్లను కలిగి ఉంది. దీంతో.. జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ సి 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కాగా.. భారత్ ఎ జట్టు 61వ సారి దులీప్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది.
Team India: ప్రస్తుతం టీమిండియాలో స్పిన్ కోటా బౌలర్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. జడేజా గాయంతో దూరమైనా చాహల్, అశ్విన్, రవి బిష్ణోయ్‌లలో ఒకరికే తుది జట్టులో అవకాశం దక్కుతుంది. ఫామ్‌తో తంటాలు పడుతున్న కుల్దీప్ యాదవ్‌ను సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించి తాను కూడా ఈ రేసులో ఉన్నాననే సంకేతాలు పంపాడు. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్-ఎతో జరిగిన రెండో వన్డేలో ఇండియా-ఎ తరఫున…