Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్ పెంచుకునేందుకు మాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. ఓన్ ఇండస్ట్రీని ఎవైడ్ చేస్తే అసలుకే మోసం వస్తుందని త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకుని ఐయామ్ గేమ్‌తో హాయ్ చెప్పాడు. సినిమా ఘోర పరాజయం పాలైంది. పలు చోట్ల షోలు రద్దు కావడం, కంటెంట్ లోపం పట్ల మూవీ లవర్స్, దుల్కర్ ఫ్యాన్స్ గట్టిగా హర్ట్ అయ్యారు. దీంతో నెటిజన్స్.. ఐయామ్ గేమ్ వైఫల్యానికి దుల్కర్ అండ్ అతడి నిర్మాణ సంస్థ వేఫారర్ కారణమంటూ ట్రోల్ చేశారు.
నిర్మాణ సంస్థ అండ్ తనపై జరిగిన ట్రోలింగ్ పై ఎట్టకేలకు దుల్కర్ సల్మాన్ స్పందించాడు. మీ విమర్శల్లో నిజాయితీ ఉందన్న హీరో.. అన్ని సరిగ్గా చేసినప్పటికీ.. కొన్ని సార్లు పరిస్థితులు తారుమారు అవుతాయంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఒక సినిమా రిజల్ట్ అంచనా వేయడం ఈజీనే అని.. తెర వెనుక ఎంతో మంది కష్టం ఉంటుందని, ఓ సినిమా తయారు కావడం అంత సులభమేమీ కాదన్నాడు. ఏదీ ఏమైనా మిస్టేక్స్‌కు తనే బాధ్యత తీసుకుంటున్నాని హూందాగా సమాధానం ఇచ్చాడు. ట్విట్టర్లో అదీ కూడా సినిమా రిలీజైన నెల తర్వాత హీరో రిప్లై ఇవ్వడం చూసి హ్యాపీ ఫీలౌతున్నారు ఫ్యాన్స్. నెక్ట్స్ మూవీతో గట్టిగా కొట్టాలని దుల్కర్‌కు సపోర్ట్ చేస్తున్నారు ఇంకొందరు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ తర్వాత హిట్ చూడలేదు. కాంత, ఐయామ్ గేమ్ డిజాస్టర్స్ అయ్యాయి. నెక్ట్స్ తెలుగు మూవీ ఆకాశంలో ఓ తారతో పలకరించబోతున్నాడు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫిల్మ్. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఫ్లాప్ చూడలేదు దుల్కర్. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ హిట్స్‌గా నిలిచాయి. ఆకాశంలో ఓ తారతో సక్సెస్ కొట్టి.. తెలుగులో తనకు తిరుగులేదని మరోసారి ఫ్రూవ్ చేసుకుంటాడా చూడాలి.
Also Read
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
తాజావార్తలు
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!