Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టాడేమో!
- ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం
- వైభవ్ సూర్యవంశీపై స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jofra Archer May Have Spotted Vaibhav Sooryavanshi Weakness: ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఈరోజు నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నేడు చెస్టర్ లీ స్ట్రీట్‌లో రాత్రి 10 గంటలకు తొలి టీ20 ఆరంభం కానుంది. భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ప్రస్తుతం ఇంగ్లండ్ బౌలర్లకు అత్యంత కఠినమైన సవాల్‌గా మారాడని పేర్కొన్నాడు. ఇప్పటివరకు అతడిని ఎదుర్కొన్న బౌలర్లలో ఎవరూ సక్సెస్ కాలేదని, ప్రతి ఒక్కరు పరుగులు సమర్పించుకున్నారు అని చెప్పాడు. ప్రతి బౌలర్ సవాల్‌కు వైభవ్ సమాధానం చెబుతున్నాడని కొనియాడాడు. అయితే ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు మాత్రం అతడిపై కాస్త ఆధిక్యం ఉండొచ్చని స్వాన్ అభిప్రాయపడ్డాడు.
వ్యూహాలు సిద్ధం చేయడం కష్టం:
వైభవ్ సూర్యవంశీ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో కొత్త ఆటగాడే అయినప్పటికీ.. ఇప్పటికే రెండు ఐపీఎల్ సీజన్లు ఆడాడని గ్రేమ్ స్వాన్ గుర్తు చేశాడు. అతని బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయని, ఇంగ్లండ్ బౌలర్లలో కొందరు ఐపీఎల్లో అతడికి బౌలింగ్ కూడా చేశారని చెప్పాడు. ‘వైభవ్ లాంటి ఆటగాడికి వ్యూహాలు సిద్ధం చేయడం చాలా కష్టం. అతడు అంతర్జాతీయ క్రికెట్లో కొత్తవాడే అయినా.. ఐపీఎల్లో ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించాడు. అతడి వీడియోల ద్వారా కొంత సమాచారం మా బౌలర్లకు అందుబాటులో ఉంది’ అని స్వాన్ వివరించాడు.
Also Read
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
- India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్‌కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
- ICC: స్టార్ క్రికెటర్‌కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
ఇప్పటివరకు ఆపిన బౌలర్ లేడు:
వీడియోలు, విశ్లేషణలు ఉన్నప్పటికీ వైభవ్ సూర్యవంశీని ఔట్ చేయడానికి స్పష్టమైన ప్రణాళిక మాత్రం ఎవరి వద్ద లేదని స్వాన్ పేర్కొన్నాడు. ‘నిజం చెప్పాలంటే ఇప్పటివరకు సూర్యవంశీపై ఏ బౌలర్ ఆధిపత్యం చెలాయించలేదు. అతడు దాదాపుగా అడ్డుకోలేని బ్యాటర్లా కనిపిస్తున్నాడు. టాప్ బౌలర్ ఎలాంటి బంతులు వేసినా సమాధానం చెప్పాడు’ అని ప్రశంసించాడు. ‘ఇంగ్లండ్ పేస్ దళంలో ఆర్చర్ మాత్రమే వైభవ్‌ను పరీక్షించే సామర్థ్యం ఉన్న బౌలర్. ఐపీఎల్ సమయంలో వైభవ్‌ను అతడు దగ్గరగా గమనించాడు. నెట్స్‌లో అతడికి బౌలింగ్ కూడా చేశాడు. అందుకే ఆర్చర్‌కు మాత్రమే కొంత ప్రయోజనం ఉండొచ్చు. మిగతా బౌలర్ల కంటే అతడికి వైభవ్ ఆట గురించి ఎక్కువ అవగాహన ఉండొచ్చు’ అని స్వాన్ చెప్పాడు.
బలహీనత కనిపెట్టాడేమో:
వైభవ్ బ్యాటింగ్‌లో ఏదైనా బలహీనతను ఆర్చర్ గుర్తించి ఉండొచ్చని, దాన్ని ఉపయోగించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి ఉండవచ్చని స్వాన్ అన్నాడు. ఆర్చర్ వేగం కూడా అతడికి అదనపు బలం అవుతుందని తెలిపాడు. ‘వైభవ్‌లో ఏదైనా బలహీనతను ఆర్చర్ గుర్తించి ఉండొచ్చు. అతడి వద్ద ప్రత్యేక ప్రణాళిక ఉండవచ్చు. ఆ ప్రణాళికను అమలు చేసేంత వేగం కూడా అతడికి ఉంది. అయితే ఇప్పటివరకు ప్రపంచ స్థాయి బౌలర్లు ఎవరైనా వైభవ్‌ను పరీక్షించినా.. అతడు ప్రతిసారి సరైన సమాధానం చెప్పాడు. అందుకే ఇంగ్లండ్‌కు కూడా అతడు పెను సవాల్ విసురుతాడు’ అని గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు.
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!