Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Vaibhav Sooryavanshi 43 Off 16 Nears Fastest 100 Sixes Record Ipl 2026

Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..

Published Date :April 29, 2026 , 7:16 am
By RAMAKRISHNA KENCHE
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vaibhav Sooryavanshi: రాజస్థాన్ యువ సంచలనం మరోసారి రెచ్చిపోయాడు. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన మెరుపులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు సాధించి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సర్లతో వైభవ్ తన టీ20 కెరీర్‌లో (27 ఇన్నింగ్స్‌ల్లో) మొత్తం 99 సిక్సర్లకు చేరుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన రికార్డు ప్రస్తుతం కీరన్ పొలార్డ్ (843 బంతుల్లో) పేరిట ఉంది. అయితే.. వైభవ్ ఇప్పటివరకు కేవలం 511 బంతులే ఎదుర్కొని 99 సిక్సర్లకు చేరుకోవడం విశేషం. ఇక నెక్ట్స్‌ మ్యాచ్‌లో ఈ బుడ్డోడు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ టాప్ ఆర్డర్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (44 బంతుల్లో 59), ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 29), కూపర్ కానలీ (14 బంతుల్లో 30) మెరుపులు మెరిపించినప్పటికీ, ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అయితే చివరలో మార్కస్ స్టోయినిస్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 22 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 62 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఆఖరి 3 ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నారు. యువ బౌలర్ బ్రిజేష్ శర్మ వేసిన చివరి ఓవర్లో స్టోయినిస్ 24 పరుగులు సాధించాడు.

Also Read

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!
  • Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
  • Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
  • Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌ విరాట్..

రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్ శర్మతో పాటు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (1/40) కూడా ధారాళంగా పరుగులు ఇచ్చారు. అయితే యువ లెగ్ స్పిన్నర్ యశ్‌రాజ్ పుంజా మాత్రం తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. 16వ ఓవర్ వరకు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేసిన యశ్‌రాజ్.. ప్రమాదకరంగా మారుతున్న కానలీని బోల్తా కొట్టించాడు. అలాగే అర్ధ సెంచరీతో ఉన్న ప్రభ్‌సిమ్రాన్‌ను సైతం తన స్పిన్ మాయాజాలంతో అవుట్ చేసి పంజాబ్‌ను దెబ్బతీశాడు. యశ్‌రాజ్ అద్భుత పోరాటం చేసినప్పటికీ, స్టోయినిస్ పవర్ హిట్టింగ్ ముందు రాజస్థాన్ బౌలర్లు నిలవలేకపోయారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • fastest 100 sixes
  • IPL 2026
  • ipl records
  • Marcus Stoinis

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..

  • West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్‌కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్‌లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions