Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: రాజస్థాన్ యువ సంచలనం మరోసారి రెచ్చిపోయాడు. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన మెరుపులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు సాధించి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సర్లతో వైభవ్ తన టీ20 కెరీర్‌లో (27 ఇన్నింగ్స్‌ల్లో) మొత్తం 99 సిక్సర్లకు చేరుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన రికార్డు ప్రస్తుతం కీరన్ పొలార్డ్ (843 బంతుల్లో) పేరిట ఉంది. అయితే.. వైభవ్ ఇప్పటివరకు కేవలం 511 బంతులే ఎదుర్కొని 99 సిక్సర్లకు చేరుకోవడం విశేషం. ఇక నెక్ట్స్ మ్యాచ్‌లో ఈ బుడ్డోడు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ టాప్ ఆర్డర్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (44 బంతుల్లో 59), ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 29), కూపర్ కానలీ (14 బంతుల్లో 30) మెరుపులు మెరిపించినప్పటికీ, ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అయితే చివరలో మార్కస్ స్టోయినిస్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 22 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 62 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఆఖరి 3 ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నారు. యువ బౌలర్ బ్రిజేష్ శర్మ వేసిన చివరి ఓవర్లో స్టోయినిస్ 24 పరుగులు సాధించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్ శర్మతో పాటు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (1/40) కూడా ధారాళంగా పరుగులు ఇచ్చారు. అయితే యువ లెగ్ స్పిన్నర్ యశ్‌రాజ్ పుంజా మాత్రం తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. 16వ ఓవర్ వరకు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేసిన యశ్‌రాజ్.. ప్రమాదకరంగా మారుతున్న కానలీని బోల్తా కొట్టించాడు. అలాగే అర్ధ సెంచరీతో ఉన్న ప్రభ్‌సిమ్రాన్‌ను సైతం తన స్పిన్ మాయాజాలంతో అవుట్ చేసి పంజాబ్‌ను దెబ్బతీశాడు. యశ్‌రాజ్ అద్భుత పోరాటం చేసినప్పటికీ, స్టోయినిస్ పవర్ హిట్టింగ్ ముందు రాజస్థాన్ బౌలర్లు నిలవలేకపోయారు.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!