Jaydev Unadkat: చరిత్ర సృష్టించిన జయదేవ్.. ట్రోఫీ హిస్టరీలోనే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaydev Unadkat Creates History By Taking Hattrick Wickets On Ranji Trophy: భారత క్రికెటర్ జయదేవ్ ఉనాద్కట్ తాజాగా రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించాడు. సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జయదేవ్.. రాజ్‌కోట్‌లో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఒక రంజీ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించడం.. ట్రోఫీ చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా జయదేవ్ తన పేరిట అత్యంత అరుదైన రికార్డ్‌ని లిఖించుకున్నాడు. 2017-18లో కర్ణాటక పేసర్ వినయ్ కుమార్ కూడా ఇలాంటిదే హ్యాట్రిక్ రికార్డ్ సాధించాడు కానీ.. అది తొలి-మూడు ఓవర్‌ల మధ్య ఉంది. అంటే.. తొలి ఓవర్ చివరి బంతికి ఒక వికెట్ తీసి, ఆ తర్వాత మూడో ఓవర్‌లోని తొలి రెండు బంతులకి రెండు వికెట్లు తీసి, హ్యాట్రిక్ అందుకున్నాడు.
Urinates On Woman: విమానంలో మద్యం తాగి.. మహిళపై మూత్ర విసర్జన
Also Read
- Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
- Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
అయితే.. జయదేవ్ మాత్రం తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ నమోదు చేశాడు. తొలి ఓవర్‌లోని మూడు, నాలుగు, ఐదు బంతులకు వరుసగా ధ్రువ్ షోరే, రావల్, యశ్‌దుల్‌ను ఔట్ చేశాడు. ఇలా ఈ హ్యాట్రిక్ రికార్డ్ సాధించడమే కాదు, ఇదే జోరుని కొనసాగించి మరో ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తం 12 ఓవర్లు వేసి, కేవలం 39 పరుగులే ఇచ్చి, 8 వికెట్లు తీశాడు. జయదేవ్ దెబ్బకు ఢిల్లీ జట్టు పేకమేడలా కుప్పకూలింది. 133 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొత్తం ఆరుగురు ఆటగాళ్లు డకౌట్ అవ్వగా, అందులో ముగ్గురు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. ఒకప్పుడు పరుగులు సమర్పించుకునే బౌలరని ట్రోలింగ్స్‌కి గురైన జయదేవ్.. ఇప్పుడు రికార్డులకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. 12 ఏళ్ల తర్వాత ఇతడు భారత టెస్ట్ జట్టులోకి కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే! బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌తో ఇతడు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!