ఐపీఎల్ 15 వ సీజన్ టైటిల్ ని గుజరాత్ టైటాన్స్ గెలుచుకుంది. ఈ జట్టు అరంగేట్రం చేసిన తొలి సీజన్ లోనే కప్ ని సొంతం చేసుకోవడం విశేషం. మెగా వేలం తరువాత ఈ జట్టు పట్ల చాలామంది విమర్శలు చేసారు. అయితే ఆ విమర్శలకు గట్టిగా జవాబిస్తూ టైటిల్ ని గెలుచుకుంది గుజరాత్ జట్టు. ఐపీఎల్ 15వ సీజన్లో చాలా మంది యువ ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు.
కోహ్లీ,రోహిత్,పంత్, ధోని లాంటి సీనియర్ ఆటగాళ్లు పెద్దగా ఆడకపోయినా కొందరు యువ ఆటగాళ్లు మాత్రం మంచి ప్రతిభను కనబర్చారు. ఐపీఎల్ 15వ సీజన్ ముగియ్యగానే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన అత్యుత్తమ ఐపీఎల్ జట్టు ను ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి కేవలం ప్రతిభ కనబర్చిన వారికే తన జట్టులో స్థానం కల్పించాడు. సచిన్ తన జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ను ఎంచుకున్నాడు. ఇక ఓపెనర్ గా సీజన్ లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న జోస్ బట్లర్ ని ఎంచుకోగా మరో ఓపెనర్ గా పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ని ఎంచుకున్నాడు.
ఇక మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ల పేర్లు వింటేనే సగం మ్యాచ్ విన్ అవ్వొచ్చు అనే విధంగా ఉంది మిడిల్ ఆర్డర్ జట్టు. సచిన్ తను పేర్కొన్న జట్టులో మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ లను ఫినిషర్ గా దినేష్ కార్తీక్ ను పేర్కొన్నాడు. ఇక ఈ ఐదుగురు ప్లేయర్లు కూడా ఈ సీజన్ లో అదరకొట్టారు.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రాను తన బౌలింగ్ దళాన్ని నడిపించే ప్లేయర్ గా నియమించుకున్నాడు. మిగితా బౌలర్లుగా మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, రషీద్ ఖాన్ ఉన్నారు. వీరందరూ తమ తమ జట్లకు మంచి ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
సచిన్ టెండూల్కర్ IPL 2022 బెస్ట్ XI:
జోస్ బట్లర్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, దినేష్ కార్తీక్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.