దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. భారత జట్టు వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు ఈనెల 12న కేప్ టౌన్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే కరోనా వచ్చిన నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ ఇతర సభ్యులతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించేందుకు వాషింగ్టన్ సుందర్ నిరాకరించాడు.
Read Also: ఐపీఎల్ స్పాన్సర్‌గా చైనా కంపెనీ అవుట్… ఇకపై ‘టాటా’ ఐపీఎల్
రెండేళ్లుగా దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న వాషింగ్టన్ సుందర్‌కు సెలక్టర్లు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడేందుకు అవకాశం కల్పించారు. దీంతో తనదైన ముద్ర వేసి వచ్చే ఐపీఎల్ వేలంలో తన సత్తా చాటాలని సుందర్ భావించాడు. అయితే మనం ఒకటి తలస్తే… విధి మరొకటి తలచినట్లు అతడు కరోనా బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో సుందర్ కరోనా నుంచి కోలుకునే దాకా సెలక్టర్లు వేచి చూస్తారా లేదా మరో ఆటగాడిని ఎంపిక చేస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. అవకాశం ఇస్తే సత్తా చాటాలని వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు.