ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య చేధనలో ముంబయి ఇండియన్స్ సూపర్ విక్టరీ సాధించింది. ముంబై జట్టుకు చివరి బంతికి 5 రన్స్ కావాల్సిన సమయంలో అప్పుడే క్రీజులోకి వచ్చిన సజనా సిక్స్ కొట్టి గెలుపును అందించింది. దీంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది.
బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా కాలుకు బంతి తగిలింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. అయితే చిన్న దెబ్బ కదా.. మళ్లీ వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ దెబ్బ బలంగా తాకడంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ లో కూడా ఆడలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ అంటే ఇరుజట్ల మధ్య గట్టిపోటీ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్…
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు.
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెట్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 34 ఏళ్ల మోరిస్ 12 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. మూడు ఫార్మాట్లలో సఫారీ జట్టు తరఫున 69 మ్యాచ్‌లు ఆడిన మోరిస్ బౌలింగ్‌లో 94 వికెట్లు పడగొట్టాడు. 2012 డిసెంబర్‌లో టీ20ల్లో అరంగ్రేటం చేశాడు. తర్వాత ఏడాది వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడు టెస్టు అరంగ్రేటం కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది.…
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. భారత జట్టు వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు ఈనెల 12న కేప్ టౌన్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే కరోనా వచ్చిన నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ ఇతర సభ్యులతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించేందుకు…