గత ఆదివారం భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. అదే పాక్ ఓపెనర్ వికెట్ కీపర్ అయిన మహ్మద్ రిజ్వాన్ మ్యాచ్ మధ్యలో బ్రేక్ వచ్చిన సమయంలో నమాజ్ చేసాడు. అయితే ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత దాని పై స్పందించిన పాక్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ హిందూ ఆటగాళ్ల ముందు నమాజ్ చేయడా నాకు చాలా స్పెషల్‌గా అనిపించిందని అన్నాడు. దాంతో ఆ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వకార్ యూనిస్ కామెంట్లపై కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందిస్తూ… క్రికెట్‌కు మతంతో సంబంధం లేదు.. వకార్ లాంటి వ్యక్తి నుంచి అలాంటి వ్యాఖ్యలు వినడం తీవ్రంగా నిరుత్సాహపర్చిందన్నాడు. ఇక చాలా మంది అభిమానులు కూడా ఇదే రకమైన స్పందన వచ్చింది. దాంతో ‘నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు పలువురి మనోభావాలను దెబ్బతీశాయి. కానీ నేను కావాలని అలా అనలేదు. దీనికి క్షమాపణలు చెబుతున్నా అని వకార్ పేర్కొన్నాడు.