T20 World Cup Record: ప్రమాదంలో కోహ్లీ T20 ప్రపంచ కప్ రికార్డు.. జోస్ బట్లర్ బ్రేక్ చేసేనా..?
- టీ20 వరల్డ్‌కప్ లో విరాట్ కోహ్లీ రికార్డుకు ప్రమాదం..
- ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ..
- విరాట్ కోహ్లీ రికార్డుకు 290 పరుగుల దూరంలో ఉన్న జోస్ బట్లర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup Record: ఈరోజు ( ఫిబ్రవరి 7న) నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీని మిస్ కానున్నారు. 2012 తర్వాత తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ ఆడడం లేదు. 2024లో భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ టైటిల్ అందించిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కింగ్ కోహ్లీ. ఈసారి వరల్డ్‌కప్‌లో ఆడటం లేదు. టీ20ల్లో విరాట్ కోహ్లీ భారత్ తరఫున అద్భుతమైన రికార్డులు నమోదు చేశాడు. 125 మ్యాచ్‌ల్లో 4,188 పరుగులు సాధించగా, ఈ ఫార్మాట్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అలాగే, బాబర్ ఆజమ్, రోహిత్ శర్మల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.
Read Also: OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే..
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఇక, టీ20 వరల్డ్‌కప్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ప్రదర్శన మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. 2014, 2022 వరల్డ్‌కప్‌ల్లో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీ, 2012, 2016 ఎడిషన్లలో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. మొత్తం టీ20 ప్రపంచ కప్‌ల్లో 35 మ్యాచ్‌లు ఆడి 1292 పరుగులు చేసిన కోహ్లీ, ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉండగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 89 నాటౌట్‌గా ఉన్నారు.
Read Also: Team India: టీ20 వరల్డ్‌కప్ ముందు భారత జట్టులో భారీ మార్పులు.. డీఎప్సీ ఎంట్రీకి లైన్ క్లియర్
అయితే, విరాట్ కోహ్లీ సాధించిన ఈ ఘనతకు ఇప్పుడు పెను ముప్పు ఏర్పడింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ రికార్డును అధిగమించే దిశగా దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు టీ20 వరల్డ్‌కప్‌ల్లో 35 మ్యాచ్‌లు ఆడి 1,013 పరుగులు చేసిన బట్లర్, కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేందుకు ఇంకో 290 రన్స్ దూరంలో ఉన్నాడు. కోహ్లీ, రోహిత్ శర్మ, మహేళ జయవర్ధనే లాంటి అగ్ర ఆటగాళ్లు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించడంతో, బట్లర్‌కు ఈ రికార్డు సాధించే అవకాశాలు మరింతగా కనిపిస్తున్నాయి.
Read Also: Tamannaah : బ్రేకప్ తర్వాత తమన్నా తీసుకున్న సాహసోపేత నిర్ణయం..
ఇదిలా ఉండగా, టీ20 వరల్డ్‌కప్ 2026 ఈరోజు ప్రారంభం కానుంది. తొలి రోజే మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. కొలంబోలో పాకిస్థాన్- నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, కోల్‌కతాలో వెస్టిండీస్- స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అలాగే, రాత్రి ముంబై వాంఖడే స్టేడియంలో భారత్ – USA మధ్య మ్యాచ్ కొనసాగనుంది. అయితే, ఈసారి విరాట్ కోహ్లీ లేకపోయినా, యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఈ వరల్డ్‌కప్‌లో ఎలా రాణిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!