Site icon NTV Telugu

T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!

T20 World Cup 2026 India

T20 World Cup 2026 India

T20 World Cup 2026 India: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు కేవలం 111 పరుగులకే దుకాణం సర్ధేసింది. దీంతో 76 పరుగుల తేడాతో భారత్ భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో పాటు టీమిండియా ఒక అవసరం లేని రికార్డును కూడా నమోదు చేసుకుంది.

LG Gram 14: అల్ట్రా లైట్‌వెయిట్, రైజెన్ AI 400 సిరీస్ ప్రాసెసర్‌తో LG Gram 14 ల్యాప్‌టాప్ విడుదల.. ధర ఎంతంటే?

ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ఆటగాళ్లు అత్యధికంగా డక్‌ (0 పరుగులు) అవుట్ అయిన జట్టుగా నిలిచారు. మొత్తం 11 సార్లు భారత బ్యాటర్లు ఖాతా కూడా తెరవకుండా పెవిలియన్ చేరారు. మరి ఈ లిస్ట్ లో ఏ స్టార్ట్ ప్లేయర్ ఎన్ని సార్లు డక్‌ అవుట్ అయ్యాడంటే..

* అభిషేక్ శర్మ – 3 సార్లు
* అక్షర్ పటేల్ – 2 సార్లు
* శివమ్ దూబే – 1 సారి
* ఇషాన్ కిషన్ – 1 సారి
* హార్దిక్ పాండ్యా – 1 సారి
* వరుణ్ చక్రవర్తి – 1 సారి
* రింకూ సింగ్ – 1 సారి
* జస్ప్రీత్ బుమ్రా – 1 సారి

Kerala Story 2: కేరళ స్టోరీ 2 ‘బీఫ్’ వివాదం.. ప్రకాష్ రాజ్ సెటైరికల్ కౌంటర్..

డక్‌ల విషయంలో భారత్ ఇటలీ (8 డక్‌లు), ఒమాన్ (7 డక్‌లు), పాకిస్థాన్ (6 డక్‌లు) లను మించి 11 డక్‌లను అందుకుంది. ఇకపోతే సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌ లో ముగ్గురు భారత బ్యాటర్లు డక్‌గా అవుట్ అయ్యారు. ఇషాన్ కిషన్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా పరుగులు చేయకుండా డక్ అవుట్ కావడంతో మొత్తం జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు కష్టాల్లో పడిపోయాయి. ముఖ్యంగా నెట్ రన్‌ రేట్ భారీగా పడిపోయింది. ఇప్పుడు సెమీఫైనల్ చేరాలంటే భారత్ తన మిగిలిన మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించాల్సి ఉంది.

Exit mobile version