T20 World Cup: ఈనెల 16న మెగా టోర్నీకి భారత జట్టు ప్రకటన.. బుమ్రా పరిస్థితేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఈనెల 16న బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లన్నీ టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును ప్రకటించేశాయి. అయితే ఇటీవల ఆసియాకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం చెందడంతో టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆల్‌రౌండర్ జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరం కావడం భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకుంటారా లేదా దీపక్ హుడాకు అవకాశమిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Read Also: YouTube Player For Education: ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇంప్రూవ్‌మెంట్ కోసం త్వరలో ‘యూట్యూబ్ ప్లేయర్’
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
మరోవైపు స్టార్ పేస్ బౌలర్ బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు జట్టులోకి తిరిగి వస్తాడా రాడా అన్నది కూడా ఆసక్తి రేపుతోంది. ఈ మేరకు బుమ్రా, హర్షల్ పటేల్‌కు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. వాళ్ల గాయాలపై స్పష్టత రాగానే జట్టును ప్రకటిస్తామని సెలక్షన్ కమిటీ చెప్తోంది. బుమ్రా వెన్ను నొప్పి గాయంతో.. హర్షల్ పటేల్ పక్కటెముకల గాయంతో ఆసియా కప్‌కు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం హర్షల్ పటేల్ కోలుకున్నట్లు కనిపిస్తున్నా.. బుమ్రా గాయంపైనే అనుమానాలు నెలకొన్నాయి. టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే జట్టు వివరాలను అందజేయడానికి సెప్టెంబర్ 16వ తేదీని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. అందుకే భారత సెలెక్షన్ కమిటీ అదే రోజు సమావేశమై జట్టును ప్రకటించనుంది.
తాజావార్తలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?