Team India: మరీ ఇంత నిర్లక్ష్యమా.. భారత బ్యాటర్లపై గవాస్కర్ ఆగ్రహం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar Fires on Team India Batters: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. పసికూన ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై మాత్రం తృటిలో ఓటమి నుంచి బయటపడింది. బౌలర్లకు సహకరించే న్యూయార్క్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో పాక్ 113/7 స్కోరుకే పరిమితమైంది. భారత్ విజయం సాధించినప్పటికీ.. బ్యాటర్ల బ్యాటింగ్ తీరు అందరినీ నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరీ ఇంత నిర్లక్ష్యంగా ఆడుతారా? అని మండిపడ్డాడు.
Also Read: T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో మొదటి వికెట్.. టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి టీమ్ ఇదే!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
‘పాకిస్థాన్‌పై భారత బ్యాటర్ల ప్రదర్శన నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. షాట్ల ఎంపికలో చాలా నిర్లక్ష్యం వహించారు. మ్యాచ్‌ను మనోళ్లు తేలిగ్గా తీసుకున్నట్లు అనిపించింది. ప్రతి బంతిని సులువుగా కొట్టేస్తామన్న అహంభావంతో ఆడారు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేద్దామని అనుకున్నట్లుంది. ఇది ఐర్లాండ్ బౌలింగ్ ఎటాక్ కాదు. ఏదో చిన్న టీమ్ బౌలింగ్ చేసినట్లు భారత బ్యాటర్లు భావించారు. ఇక్కడ ఐర్లాండ్ జట్టును అగౌరవపరచాలని నేను అనలేదు. పాకిస్తాన్ వంటి అనుభవం కలిగిన బౌలింగ్ యూనిట్‌ను ఎదుర్కొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఆడాలి. ఇంకా ఓ ఓవర్ మిగిలి ఉండగానే.. భారత్ ఆలౌట్ కావడం బాధపెట్టే అంశం. చివరి ఓవర్లో మరో 5-6 పరుగులు చేస్తే.. ప్రత్యర్థిపై ఇంకా ఒత్తిడి పెరిగేది’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
తాజావార్తలు
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!