South Africa Record: ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు ఒక్క పరుగుతో గట్టెక్కిన దక్షిణాఫ్రికా!
- నేపాల్‌పై దక్షిణాఫ్రికా విజయం
- ఐదు సార్లు ఒక్క పరుగుతో విజయం
- రెండుసార్లు భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lowest targets successfully defended by South Africa in T20Is: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా కింగ్స్‌టౌన్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ నిర్ణీత 20 ఓవరల్లో ఏడు వికెట్లకు 115 పరుగులు చేయగా.. నేపాల్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. నేపాల్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరం అవ్వగా.. గుల్షాన్ జా రనౌటవ్వడంతో దక్షిణాఫ్రికా ఒక్క పరుగుతో గట్టెక్కింది. అయితే ఒక్క పరుగు తేడాతో గెలవడం దక్షిణాఫ్రికాకు ఇదే మొదటిసారి కాదు.
టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా ఏకంగా ఐదు సార్లు ఒక్క పరుగుతో విజయం సాధించింది. దాంతో టీ20ల్లో ఒక్క పరుగు తేడాతో అత్యధిక సార్లు విజయం సాధించిన జట్టుగా ప్రొటీస్ రికార్డులో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, ఐర్లాండ్, కెన్యా జట్లు రెండో స్థానంలో ఉన్నాయి. ఈ టీమ్స్ రెండు సార్లు ఒక్క పరుగు తేడాతో గెలిచాయి. టీ20 ప్రపంచకప్‌లో ఒక్క పరుగుతో అత్యధిక సార్లు గెలిచిన రికార్డు కూడా దక్షిణాఫ్రికాదే. 2024లో నేపాల్‌తో, 2009లో న్యూజిలాండ్‌పై ప్రొటీస్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ కూడా రెండుసార్లు (2012లో దక్షిణాఫ్రికాపై, 2016లో బంగ్లాదేశ్‌పై) ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: KCR: కమిషన్లు వేయకూడదన్న విషయం ప్రభుత్వంకు తెలియదా?: కేసీఆర్
దక్షిణాఫ్రికా మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి తక్కువ స్కోరును డిఫెండ్ (కాపాడుకున్న) చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 114 పరుగులను కాపాడుతున్న ప్రొటీస్.. తాజాగా నేపాల్‌పై 116 స్కోరును కాపాడుకుంది. అంతకుముందు 120 పరుగులను రెండుసార్లు, 124 పరుగులను ఓసారి డిఫెండ్ చేసుకుంది.
తాజావార్తలు
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..