Chokers Tag Trend in X after South Africa Lost World Cup 2024 Final: వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లలో దక్షిణాఫ్రికాకు ఫైనల్ చేరిన చరిత్రే లేదు. దురదృష్టం వెంటాడడం ఓ కారణం అయితే.. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురి కావడం ఇంకో కారణంగా దక్షిణాఫ్రికా ఇన్నాళ్లు ఫైనల్‌లో అడుగుపెట్టలేదు. అయితే అయితే టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం నిలకడగా ఆడింది. లీగ్ స్టేజ్, సూపర్-8, సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడి.. ఓటమనేదే లేకుండా ఫైనల్ చేరింది.
టీ20 ప్రపంచకప్ 2024 లీగ్ దశలో దక్షిణాఫ్రికాకు ఎదురులేదు. బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ జట్లపై ఘన విజయాలు సాధించింది. సూపర్-8 ఇంగ్లండ్, వెస్టిండీస్, అమెరికాలను ఓడించింది. సూపర్-8లో ఇంగ్లండ్ చేతిలో 6 వికెట్లు ఉండగా 3 ఓవర్లలో 25 పరుగులే చేయాల్సి రాగా.. ఆ స్థితిలో కట్టడి చేసి 7 పరుగుల తేడాతో గెలిచింది. సెమీ ఫైనల్లో పసికూన ఆఫ్గనిస్తాన్‌ను సునాయాసంగా ఓడించింది. దీంతో సఫారీ జట్టు మారిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఫైనల్లో భారత్ చేతిలో ఒత్తిడికి చిత్తయింది.
Also Read: MS Dhoni: నా హార్ట్‌రేట్ పెరిగిపోయింది.. వెలకట్టలేని బర్త్‌డే గిఫ్ట్ ఇది: ఎంఎస్ ధోనీ
ఫైనల్లో 6 వికెట్లు చేతిలో ఉండగా.. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో దక్షిణాఫ్రికా తడబడి మ్యాచ్‌ను కోల్పోయింది. సునాయాసంగా గెలిచే మ్యాచ్‌ను చేతులారా టీమిండియాకు అప్పగించింది. దాంతో తొలిసారి ప్రపంచకప్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ ఓటమితో ‘చోకర్స్’ అని మరోసారి నిరూపించుకుంది. చోకర్స్ అనే యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నాకౌట్ లాంటి కీలకమైన మ్యాచ్‌ల్లో ప్రతిసారి ఓడిపోయే జట్టు లేదా ఆటగాళ్లను ‘చోకర్స్’ అని అంటారన్న విషయం తెలిసిందే.