WI vs USA: అమెరికాపై ఘన విజయం.. వెస్టిండీస్ సెమీస్ అవకాశాలు సజీవం!
- షాయ్ హోప్ మెరుపు ఇన్నింగ్స్
- అమెరికాపై విండీస్ ఘన విజయం
- సెమీస్ అవకాశాలు సజీవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Indies Crush United States in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఓడిన విండీస్.. నేడు అమెరికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. యూఎస్ఏ నిర్ధేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని 10.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షాయ్ హోప్ (82 నాటౌట్; 39 బంతుల్లో 4×4, 8×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నికోలస్ పూరన్ 27 రన్స్‌తో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ విజయంతో విండీస్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ 128 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఆడ్రిస్ గౌస్ (29) టాప్ స్కోరర్. నితీశ్‌కుమార్ (20), మిలింద్ కుమార్ (19), ఆరోన్ జోన్స్ (11) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో ఆండ్రి రస్సెల్ 3, రోస్టన్ ఛేజ్ 3 వికెట్స్ తీయగా.. అల్జారీ జోసెఫ్ 2, మోతీ ఒక వికెట్ పడగొట్టారు. లక్ష్య ఛేదనలో విండీస్ బ్యాటర్ షై హోప్ విధ్వంసం సృష్టించాడు. బౌండరీల వర్షం కురిపించాడు. జాన్సర్ ఛార్లెస్ (15) ఎక్కువసేపు నిలవలేదు. నికోలస్ పూరన్‌తో కలిసి హోప్ లక్ష్యాన్ని ఛేదించాడు. హర్మిత్ సింగ్ ఒక వికెట్ తీశాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
గత మ్యాచుల్లో ప్రభావం చూపిన సౌరభ్ నేత్రవల్కర్.. తేలిపోవడం యూఎస్‌ఏకు ఎదురుదెబ్బ తగిలింది. రోస్టన్ ఛేజ్‌కు (3/19) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక చివరి మ్యాచ్‌లో జూన్ 24న దక్షిణాఫ్రికాతో విండీస్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సెమీస్‌కు చేరుకొనే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఈ రేసులో ఉంది. యూఎస్‌ఏతో జూన్ 23న తలపడనుంది. సూపర్-8 పోరులో రెండు మ్యాచ్‌లోనూ ఓడిన యూఎస్‌ఏ కథ ముగిసింది.
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..