Rohit Sharma Record: సౌరవ్ గంగూలీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ!
- రోహిత్ శర్మ అరుదైన రికార్డు
- 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు
- అగ్రస్థానంలో ఎంఎస్ ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma become India’s second most successful captain in ICC Events: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ రెకార్డుల్లోకెక్కాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలవడంతో హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. కెప్టెన్‌గా రోహిత్ 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు భారత జట్టుకు అందించాడు. ఈ క్రమంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డుని హిట్‌మ్యాన్ బద్దలు కొట్టాడు.
ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ఉన్నాడు. మహీ 58 మ్యాచ్‌ల్లో 41 విజయాలు అందించాడు. ఈ జాబితాలో యూఎస్‌ఏతో మ్యాచ్‌కు ముందు సౌరవ్ గంగూలీతో కలిసి రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. యూఎస్‌ఏపై భారత్ గెలవడంతో గంగూలీ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు. రోహిత్ 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు టీమిండియాకు అందించగా.. దాదా 22 మ్యాచ్‌ల్లో 16 విజయాలు అందించాడు. వీరి తర్వాత విరాట్ కోహ్లీ 19 మ్యాచ్‌ల్లో 13 విజయాలను భారత జట్టుకు అందించాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Arshdeep Singh: ఎక్కువ పరుగులు ఇచ్చా.. నామీద నమ్మకం ఉంచిన రోహిత్‌కు ధన్యవాదాలు: అర్ష్‌దీప్
బుధవారం నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అమెరికాతో యూఎస్‌ఏతో మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. భారత్ విజయంలో అర్షదీప్ సింగ్ (4-0-9-4), సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్; 49 బంతుల్లో 2×4, 2×6), శివమ్ దూబే (31 నాటౌట్; 35 బంతుల్లో 1×4, 1×6) కీలక పాత్ర పోషించారు. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుని.. సూపర్-8లోకి అడుగు పెట్టింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!