ఐపీఎల్ 2025లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఆసక్తికర పోరు ఉండనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సాధించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్‌పై 1053 పరుగులు చేశాడు. కేవలం ఐదు పరుగులు చేస్తే.. అతను చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు.
Kohli : 82 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసిన నిందితులను కనిపెట్టడంలో బెంగళూరు పోలీసులకు ఆటోరిక్షా వెనుక ఉన్న 'కింగ్ కోహ్లీ' అనే పదాలు దోహదపడ్డాయి. అప్పు తీర్చేందుకే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. మహాలక్ష్మీపురంలో నివాసముంటున్న కమలన్ రావు అలియాస్ కమలమ్మ ఒంటరిగా ఉంటోంది.