Pak Boycott India Match: భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. PSLపై నిషేధం, ఆర్థిక ఆంక్షలతో పాకిస్థాన్ వాట్ నెక్ట్స్?
- భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్థాన్..
- టీ20 వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్ ను తొలగించే అవకాశం..
- PSLపై నిషేధం, ఆర్థిక ఆంక్షలతో పాకిస్థాన్ వాట్ నెక్ట్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Boycott India Match: భారత్‌తో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డిసిషన్ తీవ్ర పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తోంది. ఈ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షల విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. అత్యంత తీవ్ర చర్యగా, పాకిస్తాన్‌ను రాబోయే టీ20 వరల్డ్‌కప్ నుంచే పూర్తిగా నిషేధించే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also: Dhurandhar 2 – Toxic : ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. సౌత్ ఆడియెన్స్ ఓటు ఎవరికో?
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో భారత్‌తో జరగాల్సిన గ్రూప్ లీగ్ మ్యాచ్‌ను ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయించింది. బంగ్లాదేశ్‌ను టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పించడానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీసీబీ వెల్లడించింది. అయితే, తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడేందుకు పీసీబీ ఇప్పటికే ఐసీసీ, బీసీసీఐలతో బైండింగ్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ఒప్పంద ఉల్లంఘనగా ఐసీసీ భావిస్తోంది. కాగా, ఈ అంశంపై డిసిషన్ తీసుకునేందుకు ఐసీసీ బోర్డు ఈరోజు ( ఫిబ్రవరి 2న) వర్చువల్ సమావేశం కానుంది. పాకిస్తాన్‌ను టోర్నీలో కొనసాగించాలా లేదా నిషేధించాలా అనే కీలక అంశంపై ఈ భేటీలో చర్చ జరగనుంది. ఒకవేళ టోర్నీలో ఆడేందుకు అనుమతించినా, పాకిస్తాన్‌కు కఠినమైన ఆంక్షలు తప్పవని ఐసీసీ వర్గాలు స్పష్టం చేశాయి.
Read Also: Shashwat Sachdev : ‘ధురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ ఎంట్రీ.. హింట్ ఇచ్చిన స్టార్ హీరో
ఇక, పాకిస్తాన్‌పై విధించే ఆంక్షల్లో ప్రధానంగా టీ20 వరల్డ్‌కప్ నుంచి పూర్తిగా నిషేధించడం లేదా ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయ వాటాను నిలిపివేయడం ఉన్నాయి. అలాగే, భారత్- పాకిస్తాన్ మ్యాచ్ రద్దుతో ఐసీసీ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ జియో- స్టార్‌కు కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఈ నష్టాన్ని పీసీబీ పరిహారం రూపంలో చెల్లించాల్సి రావొచ్చని తెలుస్తోంది. సాధారణంగా భారత్- పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌కు 10 సెకన్ల ప్రకటనకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు రేటు ఉండటంతో.. మొత్తం నష్టం రూ.200 కోట్లకు మించవచ్చని అంచనా.
Read Also: Under-19 World Cup: సెమీఫైనల్లోకి భారత్.. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్
అలాగే, పాక్ తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు ఇతర క్రికెట్ దేశాలు నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ సిరీస్‌లు జరిగినా, వాటి ఫలితాలు ఐసీసీ ర్యాంకింగ్స్ లేదా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) పాయింట్లలో లెక్కించకపోవచ్చని సమాచారం. దీంతో పాటు పాకిస్తాన్‌కు ప్రధాన ఆదాయ వనరైన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)పై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఎక్కువగా ఉంది. రిటైర్డ్ ఆటగాళ్లు లేదా ఫ్రీ ఏజెంట్లు తప్ప, ప్రస్తుత అంతర్జాతీయ విదేశీ ఆటగాళ్లను పీఎస్‌ఎల్‌లో పాల్గొనకుండా నిషేధించే ఛాన్స్ ఉందని ఐసీసీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇది పీసీబీకి ఆర్థికంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఒకవేళ పాకిస్తాన్‌ను టీ20 వరల్డ్‌కప్ నుంచి నిషేధిస్తే, వారి స్థానంలో ఉగాండా జట్టును టోర్నమెంట్ లోకి తీసుకోవాలనే అంశంపై కూడా ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఐసీసీ సమావేశం అనంతరం పాకిస్తాన్ భవితవ్యం స్పష్టం కానుంది.
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!