T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో మొదటి వికెట్.. టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి టీమ్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oman Out From T20 World Cup 2024: యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా రసవత్తరంగా సాగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో మొదటి వికెట్ పడింది. మెగా టోర్నీ గ్రూప్-బి నుంచి పసికూన ఒమన్ నిష్క్రమించింది. ఆదివారం (జూన్ 9) స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో.. ఒమన్ అధికారికంగా ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. దాంతో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఒమన్ నిలిచింది.
టీ20 ప్రపంచకప్ 2024లో ఇప్పటివరకు ఒమన్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. మూడింటిలోనూ ఓడింది. నమీబియా, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌లపై ఒమన్ ఓడింది. దాంతో ఒమన్ సూపర్-8కు అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టింది. ఇక నామమాత్రమైన చివరి మ్యాచ్ జూన్ 13న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. న్యూజీలాండ్, పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంకలు కూడా గ్రూప్ స్టేజ్ దాడటం కష్టంగానే ఉంది.
Also Read
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
Also Read: IND vs PAK: కావాలనే చేశాడు.. మా టీమ్ ఓటమికి ప్రధాన కారణం అతడే: సలీమ్
ఆదివారం ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రతిక్ అథవాలే (54) అర్ద సెంచరీ చేశాడు. లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ 13.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బ్రాండెన్ మెక్‌ముల్లెన్ (61 నాటౌట్), జార్జ్ మున్సే (41) చెలరేగారు.
తాజావార్తలు
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్‌లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.