Gary Kirsten Pakistan: పాకిస్తాన్ అసలు జట్టే కాదు.. బాబర్ సేనపై చీఫ్ కోచ్ కిర్‌స్టన్ తీవ్ర విమర్శలు!
- గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన పాకిస్థాన్
- పాకిస్థాన్‌పై కిర్‌స్టన్ తీవ్ర విమర్శలు
- జట్టులో అందరూ విడిపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gary Kirsten Comments on Pakistan Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన పాకిస్థాన్‌పై ఆ జట్టు చీఫ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ అసలు జట్టే కాదని, ఆ టీంలో ఐక్యత లేనే లేదన్నాడు. పాక్ జట్టులోని కీలక ఆటగాళ్ల మధ్య మాటలు లేవని, కొంతమంది ఆటగాళ్లు తీవ్రమైన ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపాడు. ఫిట్‌నెస్ సమస్యలే టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ వైఫల్యానికి ప్రధాన కారణం అని గ్యారీ కిర్‌స్టన్ చెప్పినట్లు పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ పేర్కొంది.
‘పాకిస్తాన్ జట్టులో అసలు ఐక్యత లేదు. పాక్ జట్టు అని పిలుస్తారు కానీ అది జట్టే కాదు. ప్లేయర్స్ ఒకరికొకరు మద్దతుగా నిలవరు. జట్టులో అందరూ విడిపోయారు. గతంలో చాలా జట్లతో పనిచేశా. కానీ ఇలాంటి పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు. భారత్ చేతిలో ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ మైదానంలో 120 పరుగుల లక్ష్యం అంత ఈజీ కాదని తెలుసు. టీమిండియా 120 పరుగుల వద్దే ఆగిపోయిందంటే.. లక్ష్య ఛేదన కష్టమే. అయితే పాక్ 72/2తో ఉన్నప్పుడు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. అలాంటి స్థితి నుంచి మ్యాచ్‌ను కోల్పోవడం చాలా నిరాశ కలిగించింది’ అని గ్యారీ కిర్‌స్టన్ పేర్కొన్నాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Lockie Ferguson Record: ఫెర్గూసన్ సంచలన ప్రదర్శన.. 4 ఓవర్లు, 4 మెయిడెన్లు, 3 వికెట్లు!
టీ20 ప్రపంచకప్ 2024కు కావాల్సిన సామర్థ్యం పాకిస్తాన్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు లేదని, షాట్ సెలెక్షన్‌లో కొందరికి కనీస క్లారిటీ లేదని గ్యారీ కిర్‌స్టన్ విమర్శించినట్లు జియో న్యూస్ తమ కథనంలో పేర్కొంది. మెరుగైన ప్రదర్శన చేసే వారికే జట్టులో చోటు ఇవ్వాలని, జట్టు విజయం కోసం ఆడే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని పీసీబీ అధికారులతో కిర్‌స్టన్ అన్నట్లు తెలుస్తోంది. పేలవ ప్రదర్శన, గ్రూప్ రాజకీయాలు చేసే వారికి జట్టులో చోటు ఇవ్వొద్దని సెలెక్టర్లకు సూచించినట్లు సమాచారం. ఇక టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా, భారత్ చేతిలో ఓడిన పాక్.. కెనడా, ఐర్లాండ్‌పై గెలిచినా సూపర్ 8కు అర్హత సాధించలేకపోయింది.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!