Nepal vs Italy: ఇటలీ సంచలనం.. 10 వికెట్లతో అద్భుత విజయం!
- టీ20 వరల్డ్ కప్ 2026లో నేపాల్‌పై ఇటలీకి 10 వికెట్ల ఘన విజయం
- ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 123 పరుగులకు ఆలౌట్
- 124 పరుగుల లక్ష్యాన్ని 12.4 ఓవర్లలోనే ఛేదించిన ఇటలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal vs Italy: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026)లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-C మ్యాచ్‌లో ఇటలీ జట్టు నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 12.4 ఓవర్లలోనే ఛేదించి ఔరా అనిపించింది.
The Paradise Release Date: ఇట్స్ అఫీషియల్.. నాని రక్తపాతం సృష్టించడానికి డేట్ ఫిక్స్!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 19.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయింది. నేపాల్ బ్యాటర్లలో ఆరిఫ్ షేక్ 27 పరుగులు, రోహిత్ పౌడెల్ 23 పరుగులు, ఆసిఫ్ షేక్ 20 పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులను రాబట్టారు. చివర్లో కరణ్ KC 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇటలీ బౌలర్లలో క్రిషన్ కలుగమాగే 3 వికెట్లు తీసి నేపాల్ బ్యాటింగ్ లైనప్ ను కూల్చేశాడు. దీనితో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే బెన్ మనేంటి 2 వికెట్లు తీసి అతనికి మంచి సహకారం అందించాడు.
Jos Buttler: 122 మీటర్ల క్యాచ్.. గిన్నిస్ బుక్‌లో చేరిన జోస్ బట్లర్!
124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీకి ఓపెనర్లు అద్భుత ఆరంభం అందించారు. జస్టిన్ మోస్కా 60 (44 బంతులు), ఆంథోనీ మోస్కా 62 (32 బంతులు) నాటౌట్ ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు అజేయ భాగస్వామ్యం నమోదు చేసి నేపాల్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీనితో ఇటలీ 10 వికెట్లతో అద్భుత విజయం సాధించింది.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!