SA vs NEP: ఒకే ఒక్క పరుగు.. దక్షిణాఫ్రికాను వణికించిన పసికూన నేపాల్!
- దక్షిణాఫ్రికాను వణికించిన నేపాల్
- చివరి బంతికి రనౌట్
- గ్రూప్-డీలో అన్ని మ్యాచ్‌లను గెలిచిన ప్రొటీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Africa Beat Nepal By 1 Run Only: టీ20 ప్రపంచకప్ 2024లో టాప్ టీమ్ దక్షిణాఫ్రికాను పసికూన నేపాల్ వణికించింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడింది. నేపాల్ సంచలన విజయం నమోదు చేసేలా కనిపించినా.. ఆఖరి బంతికి బోల్తాపడి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. కింగ్స్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 రన్స్ చేసి ఓడింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెతేయడంతో ప్రొటీస్ తృటిలో ఓటమి నుంచి బయటపడింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవరల్లో 7 వికెట్లకు 115 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ (43; 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), ట్రిస్టన్ స్టబ్స్ (27 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. నేపాల్ బౌలర్లలో కుశాల్ (4/19) నాలుగు, దీపేంద్ర సింగ్ (3/21) మూడు వికెట్స్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్లు డికాక్ (10), మార్‌క్రామ్ (15), క్లాసేన్ (3), మిల్లర్ (7) విఫలమయ్యారు.
Also Read
- T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్‌ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
Also Read: T20 World Cup 2024: హెల్మెట్‌లో ఇరుక్కున్న బంతి.. చేత్తో పట్టుకుంటే ఔట్ ఇస్తారని ఏం చేశాడంటే?
ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఆసిఫ్ షేక్ (42; 49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), అనిల్ సా (27; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడారు. ప్రొటీస్ స్పిన్నర్ షంసీ (4/19) నాలుగు వికెట్స్ తీసి.. పసికూనను దెబ్బతీశాడు. నేపాల్ విజయానికి చివరి 6 బంతుల్లో 8 పరుగులు అవసరం అయ్యాయి. బార్ట్‌మన్ వేసిన చివరి ఓవర్ తొలి రెండు బంతులకు పరుగులేమి రాలేదు. గుల్షాన్ మూడో బంతికి ఫోర్ బాది.. నాలుగో బంతికి రెండు పరుగులు చేశాడు. దాంతో నేపాల్ జట్టుకు రెండు బంతుల్లో 2 పరుగులు అవసరం అయ్యాయి. అయిదో బంతిని పరుగు తీయని గుల్షాన్.. చివరి బంతికి రనౌట్ అయ్యాడు. దాంతో ఒక పరుగు తేడాతో నేపాల్ ఓడిపోయింది. ఈ విజయంతో గ్రూప్-డీలో అన్ని మ్యాచ్‌లను ప్రొటీస్ గెలిచింది.
- Tags
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!