ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మహదేవ్ ఆన్లైన్ బుక్’ అక్రమ బెట్టింగ్ సిండికేట్ ప్రధాన ప్రమోటర్ సౌరభ్ చంద్రకార్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విజయవంతంగా భారత్‌కు రప్పించింది. ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల సమన్వయంతో ఒమన్ సుల్తానేట్ నుంచి అతడిని అప్పగించే ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒమన్ వెళ్లిన సీబీఐ బృందం నిందితుడిని భారత్‌కు తీసుకొచ్చింది. సౌరభ్ చంద్రకార్పై ఇప్పటికే సీబీఐ రెండు కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం ప్రాసిక్యూషన్ ఫిర్యాదును నమోదు చేసింది.
విదేశాల్లో ఉంటూ భారతీయ పౌరులను లక్ష్యంగా చేసుకుని సరిహద్దులు దాటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న పరారీలో ఉన్న నిందితులను స్వదేశానికి రప్పించి, చట్టం ముందు నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఈ అప్పగింత కీలక మైలురాయిగా నిలిచింది.
Also Read
- Drugs: చక్కెర రూపంలో డ్రగ్స్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..
- Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
- Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
- Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
విదేశాల నుంచి సాగిన అక్రమ బెట్టింగ్ దందా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మహదేవ్ ఆన్లైన్ బుక్ కేసుల దర్యాప్తును సీబీఐ చేపట్టింది. విదేశాల్లో ఉంటూ భారత్‌లో నడిపించిన అతిపెద్ద అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ సిండికేట్లలో ఇది ఒకటని దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా విస్తరించిన ఫ్రాంచైజ్ “ప్యానెల్స్”, “బ్రాంచీల” నెట్వర్క్ ద్వారా క్రికెట్, ఫుట్‌బాల్, కార్డ్ గేమ్స్‌తో పాటు ఇతర క్రీడలపై అక్రమ బెట్టింగ్‌లను నిర్వహించారు. వీటి ద్వారా వినియోగదారులను చేర్చుకుని, వారి వద్ద నుంచి బెట్టింగ్ మొత్తాలను వసూలు చేసేవారు.
ఈ అక్రమ బెట్టింగ్ ద్వారా వచ్చిన భారీ మొత్తాలను పెద్ద సంఖ్యలో ఉన్న ‘మ్యూల్ బ్యాంక్ ఖాతాల’ (ఇతరుల పేరిట తెరిచిన ఖాతాలు) ద్వారా మళ్లించారు. పలు లావాదేవీల రూపంలో వాటిని లేయరింగ్ చేసి, హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించారు. ఈ సిండికేట్ ఎలాంటి అడ్డంకులు లేకుండా కార్యకలాపాలు సాగించేందుకు గాను, ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా ముడుపులు (రక్షణ రుసుము) చెల్లించినట్లు దర్యాప్తులో స్పష్టమైంది.
కీలక సెక్షన్ల కింద కేసులు – ఆస్తుల జప్తు అవినీతి నిరోధక చట్టం (1988), నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీలకు సంబంధించిన భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లతో పాటు ఛత్తీస్‌గఢ్ జూద నిరోధక చట్టం కింద సీబీఐ ఛార్జిషీట్లను దాఖలు చేసింది. వీటిలో సౌరభ్ చంద్రకార్ కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఈడీ సైతం భారత్‌తో పాటు విదేశాల్లోని పలు ఆస్తులను అటాచ్ చేసింది.
ఒమన్ పోలీసుల సహకారం – వేగవంతమైన చర్యలు సౌరభ్ చంద్రకార్పై జారీ చేసిన ‘రెడ్ కార్నర్ నోటీసు’ ఆధారంగా ఒమన్ రాయల్ పోలీస్ అతడి ఆచూకీని కనిపెట్టి అదుపులోకి తీసుకుంది. అనంతరం సీబీఐ, ఈడీ సంస్థలు సేకరించిన పూర్తి ఆధారాలతో కూడిన అధికారిక అప్పగింత ప్రతిపాదనలను ఒమన్ ప్రభుత్వానికి పంపాయి.
భారత ప్రభుత్వ విభాగాలు, ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో, ఒమన్ సుల్తానేట్ అధికార యంత్రాంగం పరస్పర సమన్వయంతో ఈ ప్రక్రియను వేగవంతం చేశాయి. అప్పగింతకు ఆమోదం లభించిన వెంటనే సీబీఐ బృందం మస్కట్‌కు చేరుకుని నిందితుడిని భారత్‌కు తరలించింది.
ఈ సందర్భంగా ఒమన్ ప్రభుత్వం, ఒమన్ రాయల్ పోలీస్ అందించిన సహకారానికి సీబీఐ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సమన్వయం ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను, అంతర్జాతీయ నేరాలను అణచివేయడంలో ఉన్న ఉమ్మడి సంకల్పాన్ని చాటుతోందని పేర్కొంది.
రాయ్‌పూర్ సీబీఐ కోర్టులో హాజరు నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, రవాణా రిమాండ్ (ట్రాన్సిట్ రిమాండ్) పొంది రాయ్‌పూర్‌కు తరలించనున్నారు. రేపు అతడిని రాయ్‌పూర్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!