Home Minister Anitha: అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం, అచ్యుతాపురం, ఏపీఎస్ఈజడ్ లో SVS కెమికల్ ఇండస్ట్రీస్ దగ్గర అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో కంపెనీ ప్రతినిధులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలో ఇన్ని ట్యాంకులు ఎందుకు ఉన్నాయని మంత్రి అనిత ప్రశ్నించింది.
Read Also: Sarvam Maya : 10 రోజుల్లో రూ.100 కోట్లు.. యంగ్ హీరో మాస్ కంబ్యాక్
నిన్న దురదృష్టకరమైన సంఘటన జరిగింది అని హోంమంత్రి అనిత తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించారు. ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రమాద ఘటన స్థలానికి వెంటనే చేరుకొని మంటలు అదుపు చేశారు. అధికారులు స్థానిక ఎమ్మెల్యే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయినివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించింది. కంపెనీ ప్రతినిధులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. ఎవరిని ఉపేక్షించేది లేదని వంగలపూడి అనిత వెల్లడించింది.